
రూ.5 కోట్ల డ్రగ్స్.. ఇద్దరు జవాన్ల అరెస్ట్
డెహ్రడూన్ : సుమారు 5 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న రాజు షేక్, ఫూల్ సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమచల్ ప్రదేశ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మంజు రెహమాన్ అనే మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు జవాన్లు, మరో సాధారణ వ్యక్తి హెరాయిన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిని తరువాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్‌లో భాగంగా ఈ కారును సోదా చేయడంతో.. హెరాయిన్ బయటపడింది.
చెకింగ్ సమయంలో మేం జవాన్లం అంటూ.. వారు పోలీసులతో వాగ్యుద్దానికి దిగారు. హెరాయిన్‌తో పట్టుపడిన జవాన్లు, సాధారణ వ్యక్తిని డెహ్రాడూన్ తరలించి ఆర్మీ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేషన్ చేస్తున్నాయి. వీరి మీద మాదక ద్రవ్యాల అక్రమ రవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత తెలిపారు.