3 DRG Jawans Killed in Naxal Ambush in Sukma District of Chhattisgarh - Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

Published Sat, Feb 25 2023 11:55 AM | Last Updated on Sat, Feb 25 2023 1:43 PM

Chhattisgarh Sukma Encounter Few Jawans Dead - Sakshi

( ఫైల్‌ ఫోటో )

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా కుందేడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం డీఆర్‌జీ బృందాలు సుక్మా జిల్లా జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ నుంచి నక్సల్ పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. జాగర్‌గుండ కుందేడ్ మధ్య ఉదయం 9:00 గంటల సమయంలో మవోయిస్టులు వీరికి ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఏఎస్‌ఐ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ రామురామ్ నాగ్ (జాగర్గుండ), అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా(మిటగూడ/జాగర్గుండ), సైనిక్ వంజం భీమా(మర్కగడ/చింతల్నార్) కాల్పుల్లో మరణించారు.
చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement