Sukma encounter
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా కుందేడ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం డీఆర్జీ బృందాలు సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ నుంచి నక్సల్ పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. జాగర్గుండ కుందేడ్ మధ్య ఉదయం 9:00 గంటల సమయంలో మవోయిస్టులు వీరికి ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ రామురామ్ నాగ్ (జాగర్గుండ), అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా(మిటగూడ/జాగర్గుండ), సైనిక్ వంజం భీమా(మర్కగడ/చింతల్నార్) కాల్పుల్లో మరణించారు. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
సంబరాలకు దూరంగా రాజ్‌నాథ్..!
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలంతా సంబరాల్లో మునిగిఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 12 మంది సిఆర్పీఫ్ జావానులు మృతిచెందడమేనని ఆయన చెప్పారు. శనివారం ఉదయం గం 9.15 సమయంలో కొత్తచెరువు గ్రామంలోని బేజి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి సీఆర్పీఎఫ్, 219వ బెటాలియన్‌పై మెరుపుదాడి చేయడం తెలిసిందే. కు చెందిన 12 మందిని కాల్చిచంపి వారి దగ్గర ఉన్న ఆయుధాలను దొంగిలించిన సంగతి తెలిసిందే. దీనినిపిరికి చర్యఅని వర్ణిస్తూ.. జవానుల త్యాగాలు వృధా కాబోవన్నారు. మావోల దాడి వ్యూహాత్మకమే : పోలీసులు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వ్యూహాత్మకంగా తమ టార్గెట్‌ను పరిధిలోకి రానిచ్చిన మావోలు మందుపాతరలు పేల్చారనీ, దేశీయంగా తయారైన మోర్టార్లను వినియోగించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో హాలీవుడ్ చిత్రం ‘రాంబో’ తరహాలో బాణాలకు చివర పేలుడు పదార్థాలు కట్టి దాడికి తెగబడ్డారని అన్నారు. బస్తర్ జిల్లాలోని నారాయణపూర్, కొండాగావ్ క్యాంపులపై మావోయిస్టులు ఇలాగే బాంబులున్న బాణాలతో విరుచుకుపడ్డారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ 219వ బెటాలియన్‌కు చెందిన 112 మంది జవాన్లు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిర్మాణంలో ఉన్న భెజ్జీ–ఇంజ్రమ్ రోడ్డు మార్గాన్ని పహారా కాసేందుకు బయల్దేరారు. పహారాతోపాటు భెజ్జీలో ప్రతి శనివారం జరిగే మార్కెట్ స్థలాన్ని జవాన్లే సిద్ధం చేయాలి. ఈ క్రమంలో వారి కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. జవాన్లు ఉదయం 8.50 గంటలకు కొత్తచెరు ప్రాంతానికి చేరుకోగానే అక్కడే నక్కిఉన్న మావోలు మందుపాతరలు పేల్చడమే కాకుండా తూటాలవర్షం కురిపించారు. ఈ దాడిలో 12 మంది జవాన్లు చనిపోయారు. గత ఏడాదిన్నరలో మావోలు చేసిన అతి పెద్దదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. మావోలు మార్చి, జూన్ మాసాల్లో వ్యూహాత్మక ఎదురుదాడి కార్యక్రమాన్ని(టీసీఓసీ) పాటిస్తారు. చెట్లన్నీ ఎండిపోయి భద్రతా బలగాల కదలికలు స్పష్టంగా కనిపించడం వల్లే వారు టీసీఓసీని పాటిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. -
15 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఎస్టీఎఫ్, డీఆర్జీ జిల్లా పోలీసులతో కూడిన సంయుక్త దళం వెళ్తుండగా, టేటేమడుగు సమీపంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. రెండువైపులా జరిగిన కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను తీసుకుని పోలీసులు దాదాపు 16 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తుండగా, మధ్యలో మరోసారి మావోయిస్టులు.. పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దాంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వాళ్లను హెలికాప్టర్ ద్వారా రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. దాదాపు 250 మంది జవాన్లతో కూడిన బృందం టేటేమడుగు సమీపంలోకి వెళ్లినప్పుడు అక్కడ 150 మంది మావోయిస్టులు 300 మంది స్థానికులను రక్షణగా పెట్టుకుని దాడి చేశారని, జవాన్ల కాల్పుల్లో 15 మంది వరకు మావోయిస్టులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
భారీ ఎన్కౌంటర్: ఏడుగురు పోలీసుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు పోలీసులు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సుక్మా జిల్లాలోని కంకేర్‌లంక, చింతగుఫ గ్రామాల పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు జవాన్లు మరణించినట్లు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అదనపు డీజీ ఆర్కే విజ్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన తరహాలోనే మావోయిస్టులు ఈ ఆపరేషన్‌ను నర్విహించనట్లు తెలిసుస్తోంది. అయితే మావోయిస్టుల కదలికలను ఎస్టీఎఫ్ బలగాలు ముందే గుర్తించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఛత్తీస్‌గఢ్ పోలీసు బృందానికి చెందిన 30- 35 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ అనంతరం బేస్ క్యాంపునకు తిరిగివస్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లపై కాల్పులు జరిపేందుకు దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు కాపుకాసి చుట్టుముట్టారు. ఇది గమనించిన వెంటనే జవాన్లు ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. ఒకవేళ అలా అప్రమత్తం కాకపోయిఉంటే గనుక జవాన్లందరూ అక్కడికక్కడే మరణించి ఉండేవారని సీఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు జవాన్లు మరణించారు. గాయపడినవారికి కాంచన్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత ఆరు నెలల్లో మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఘటన ఇదే కావడం గమనార్హం. 2013లో సాల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ సహా కాంగ్రెస్ నాయకులు, జవాన్లను హతమార్చిన మావోయిస్టులు.. పోలీసులను పెద్ద ఎత్తున చుట్టుముట్టడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం. -
భారీ ఎన్కౌంటర్: ఏడుగురు పోలీసుల మృతి