భారీ ఎన్కౌంటర్: ఏడుగురు పోలీసుల మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు పోలీసులు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సుక్మా జిల్లాలోని కంకేర్లంక, చింతగుఫ గ్రామాల పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు జవాన్లు మరణించినట్లు ఛత్తీస్గఢ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అదనపు డీజీ ఆర్కే విజ్ తెలిపారు.
నాలుగేళ్ల క్రితం 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన తరహాలోనే మావోయిస్టులు ఈ ఆపరేషన్ను నర్విహించనట్లు తెలిసుస్తోంది. అయితే మావోయిస్టుల కదలికలను ఎస్టీఎఫ్ బలగాలు ముందే గుర్తించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఛత్తీస్గఢ్ పోలీసు బృందానికి చెందిన 30- 35 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ అనంతరం బేస్ క్యాంపునకు తిరిగివస్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లపై కాల్పులు జరిపేందుకు దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు కాపుకాసి చుట్టుముట్టారు. ఇది గమనించిన వెంటనే జవాన్లు ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. ఒకవేళ అలా అప్రమత్తం కాకపోయిఉంటే గనుక జవాన్లందరూ అక్కడికక్కడే మరణించి ఉండేవారని సీఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు జవాన్లు మరణించారు. గాయపడినవారికి కాంచన్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత ఆరు నెలల్లో మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఘటన ఇదే కావడం గమనార్హం. 2013లో సాల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ సహా కాంగ్రెస్ నాయకులు, జవాన్లను హతమార్చిన మావోయిస్టులు.. పోలీసులను పెద్ద ఎత్తున చుట్టుముట్టడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం.