15 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఎస్టీఎఫ్, డీఆర్‌జీ జిల్లా పోలీసులతో కూడిన సంయుక్త దళం వెళ్తుండగా, టేటేమడుగు సమీపంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. రెండువైపులా జరిగిన కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను తీసుకుని పోలీసులు దాదాపు 16 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తుండగా, మధ్యలో మరోసారి మావోయిస్టులు.. పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దాంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వాళ్లను హెలికాప్టర్ ద్వారా రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు.
దాదాపు 250 మంది జవాన్లతో కూడిన బృందం టేటేమడుగు సమీపంలోకి వెళ్లినప్పుడు అక్కడ 150 మంది మావోయిస్టులు 300 మంది స్థానికులను రక్షణగా పెట్టుకుని దాడి చేశారని, జవాన్ల కాల్పుల్లో 15 మంది వరకు మావోయిస్టులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.