
సైనికుల తెగువకు గర్విస్తున్నా: మోదీ
బెంగళూరు: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో భద్రతా బలగాలు, సైనికుల తెగువకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత పురోగతిని చూడలేని వాళ్లే పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి దిగారని పేర్కొన్నారు. మన భద్రతాబలగాలు వాళ్లకి ధీటుగా బదులిచ్చారన్నారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం మైసూరు చేరుకున్నారు. దత్త పఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం సత్తూరు మఠంలో నిర్వహించిన జగద్గురు డాక్టర్ శివరాత్రి రాజేంద్ర మహాస్వామీజీ జన్మతమానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మైసూరులోనే శనివారం బస చేసి ఆదివారం ఉదయం మైసూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.