Naxal attack
-
సుక్మా జిల్లాలో మావోయిస్ట్‌ల అలజడి
ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు. -
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
ఛత్తీస్‌గఢ్: 13 ఏళ్లలో 11 నక్సల్ ఘాతుకాలు!
ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. తాజాగా నిన్న (జనవరి 30)న ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల సమస్య ఈనాటిది కాదు. 2023 ఏప్రిల్ 26న నక్సలైట్ల దాడిలో 10 మంది డీఆర్జీ సైనికులు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల భారీ దాడి 2010 ఏప్రిల్ 6న జరిగింది. ఈ ఘటనలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. నక్సలైట్ల దాడిలో సామాన్యులు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో పలువురు రాజకీయ నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2023, మే 25న జరిగింది. ఆ రోజున జీరం వ్యాలీలో నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014, ఏప్రిల్ 12న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన నక్సలైట్ల దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, సామాన్యులకు నక్సలైట్లు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2010 నుంచి నక్సల్స్ భారీ ఘాతుకాలు 2023, ఏప్రిల్ 26 దంతెవాడలో జరిగిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2021, ఏప్రిల్ బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో 22 మంది సైనికులు వీరమరణం పొందారు. 2020, మార్చి సుక్మాలో జరిగిన దాడిలో 17 మంది సైనికులు అమరులయ్యారు. 2017, ఏప్రిల్ 24 సుక్మాలో జరిగిన దాడిలో 25 మంది సైనికులు వీరమరణం పొందారు. 2017, మార్చి 11 సుక్మాలో జరిగిన దాడిలో 12 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2017, మార్చి దంతెవాడలో జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015, ఏప్రిల్ దంతెవాడలో జరిగిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2014, ఏప్రిల్ 12 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో 14 మంది సైనికులు వీరమరణం పొందారు. 2013, మే 25 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 30 మందికిపైగా మృతి. 2010, ఏప్రిల్ 6 దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. -
బస్తర్‌లో 404 సార్లు చక్కర్లుకొట్టాయి!
సాక్షి, రాయ్‌పూర్: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సామే. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలింగ్ స్టేషన్లకు పంపించాలి. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలుసహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావాలి. నక్సల్స్ మందుపాతరలు, మెరుపుదాడులకు పేరుగాంచిన బస్తర్ జిల్లాలో సిబ్బంది తరలింపు సవాళ్లతో కూడుకున్నదే. అందుకే ఈసారీ రోడ్డు మార్గంలోకాకుండా వాయుమార్గంలో సిబ్బందిని తరలించి శెభాష్ అనిపించుకుంది భారత వాయుసేన. రాష్ట్రంలో తొలి దఫా ఎన్నికలు జరిగిన నవంబర్ 7వ తేదీన 20 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం తెల్సిందే. ఈ నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు 860 మందికిపైగా సిబ్బందిని తరలించేందుకు వాయుసేన తన ఎంఐ–17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఎనిమిది హెలీకాప్టర్లు ఆరు రోజులపాటు ఇలా ఎన్నికల సిబ్బంది తరలింపులో అవిశ్రాంతంగా పనిచేశాయి. ‘సిబ్బంది తరలింపు కోసం హెలికాప్టర్లు 404 సార్లు రాకపోకలు సాగించాయి. విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది మాత్రమే కాదు వాయుసేన హెలికాప్టర్లు తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి’ అని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్, కాంకేర్, దంతేవాడ, నారాయణ్‌పూర్ జిల్లాలో 156 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించిన 860కిపైగా సిబ్బందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన హెలికాప్టర్లలోనే తరలించింది’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్రాజ్ చెప్పారు. హెలికాప్టర్లపైకీ నక్సల్ కాల్పులు! 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బందిని తరలిస్తున్న హెలికాప్టర్లపైకీ నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆనాడు బీజాపూర్ జిల్లాలోని పెడియా గ్రామంలో ఓటింగ్ యంత్రాలు, సిబ్బందితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ పైకి నక్సల్స్ కాల్పులు జరపగా కాక్‌పిట్‌లోని ఫ్లైట్ ఇంజనీర్ సర్జెంట్ ముస్తఫా అలీ మరణించారు. వెంటనే అందులోని కెపె్టన్ స్క్వాడ్రాన్ లీడర్ టీకే చౌదరీ చాకచక్యంగా అది కూలిపోకుండా చూసి సురక్షితంగా జగ్దల్పూర్ పట్టణంలో ల్యాండ్చేశారు. -
దీటైన జవాబిస్తాం
-
దీటైన జవాబిస్తాం
గువాహటి/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి కారణమైన వారికి సరైన సమయంలో సరైన జవాబు చెబుతామని కేంద్ర హోంశాంఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్కౌంటర్ అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంఖ్యను బట్టి చూస్తే ఈ ఘటనలో ఇరువైపులా నష్టం వాటిల్లిందని, ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అస్సాంలో ఉన్న అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ గురించి తెలియగానే ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై, తాజా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నక్సలైట్ల దాడిలో మన భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ హింసాకాండను సహించే ప్రసక్తే లేదు. బాధ్యులకు సరైన సమయంలో దీటైన జవాబు ఇచ్చితీరుతాం’’ అని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన జల్కాబారీ నియోజకవర్గంలో, బార్పేట జిల్లా సోర్భోగ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి(ఎన్ఈడీఏ) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అస్సాం అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా అంటూ లేదని విమర్శించారు. ఎన్డీయే నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అస్సాంను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక టూరిస్టులాగా అస్సాంకు వచ్చివెళ్తున్నాడని అమిత్ షా వ్యాఖ్యానించారు. అస్సాంలో ఇప్పటికే జరిగిన రెండు దశల ఎన్నికల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను దక్కించుకోబోతోందని జోస్యం చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ ఇంటికెళ్లబోతున్నారని, బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. అస్సాంలో బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాజధాని గువాహటిని ఆగ్నేయ ఆసియాకు స్టార్టప్ రాజధానిగా మారుస్తామని ఉద్ఘాటించారు. నక్సలైట్లపై విజయం తథ్యం ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి, పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని ఆదివారం సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నక్సలైట్లు కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఈ దురాగతానికి పాల్పడినట్లు భూపేష్ భగేల్ చెప్పారు. వారి సిద్ధాంతాల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. తీవ్రవాదులకు పరాజయం తప్పదని పేర్కొన్నారు. భద్రతా బలగాలు నైతిక స్థైర్యం కోల్పోలేదని, ఈ పోరాటంలో నక్సలైట్లపై కచ్చితంగా విజయం సాధిస్తారని అమిత్ షాకు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిసి పోరాడుతున్నాయని, విజయ బావుటా ఎగురవేస్తాయని అమిత్ షా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా ట్వీట్ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు మరువలేనివని అమిత్ షా శ్లాఘించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శాంతి, అభివృద్ధి కోసం శత్రువులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్కౌంటర్లో గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు. -
గడ్చిరోలి గౌండ్ రిపోర్ట్
-
పోలీసులపై మావోల పంజా
సాక్షి, ముంబై, హైదరాబాద్, భూపాలపల్లి/ గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాను తునాతునకలైంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మావోయిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపారు. కాగా, మావోయిస్టుల దుశ్చర్యను ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సీఎం ఫడ్నవీస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. మరోవైపు మావోయిస్టులకు దీటైన జవాబు ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ ప్రకటించారు. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవమైన మే 1నే మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడటం గమనార్హం. పక్కాగా వలపన్ని దాడి.. పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు కమాండోలను ఉచ్చులోకి లాగి హత్య చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున పలువురు మావోయిస్టులు ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న జేసీబీలు, ట్రాక్టర్లు, డంపర్లు సహా 36 వాహనాలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం అక్కడకు బయలుదేరింది. వీరి వాహనం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్దకు రాగానే రోడ్డుపై చెట్లు పడిపోయి ఉన్నాయి. వెంటనే వ్యాను నుంచి దిగిన కమాండోలు వాటిని తొలగించబోతుండగా అక్కడే నక్కిన మావోలు ఒక్కసారిగా మందుపాతరను పేల్చారు. అనంతరం పేలుడుకు చెల్లాచెదురైన కమాండోలపై అన్నివైపుల నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు ఎదురుకాల్పులు జరుపుతూనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సాధారణ వ్యానులో ప్రయాణం.. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలిలో కూంబింగ్ సందర్భంగా భద్రత విషయంలో పోలీస్ కమాండోలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆపరేషన్‌కు వెళుతూ కూడా వీరంతా మైన్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వ్యానులో ప్రయాణించడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై మహారాష్ట్ర పోలీస్ డీజీపీ సుబోధ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘నిఘా వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పుడే చెప్పడం సరికాదు. ఈ కూంబింగ్‌కు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? క్యూఆర్టీ కమాండోల కదలికలపై మావోయిస్టులకు ముందే సమాచారం అందిందా? అనే కోణంలో విచారణ జరుపుతాం. మావోయిస్టులకు దీటుగా బదులివ్వగలిగే సత్తా మాకుంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకే మావోలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. గడ్చిరోలిలో ఎన్నికలు పూర్తయిందున దాడులకు ఎన్నికలను ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. కాగా, 2018, ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దాడి వెనుక తెలంగాణ మావోయిస్టు కమిటీ గడ్చిరోలి దాడికి మావోయిస్టులు చాలాకాలం క్రితమే పథక రచన చేశారని నిఘావర్గాలు తెలిపాయి. ఈ దాడి పథకం అమలులో తెలంగాణ మావోయిస్టు కమిటీ నాయకులే కీలకమని వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నాయి. మరోవైపు హైఅలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు, గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించారు. గడ్చిరోలిలో కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు మావోలు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించే అవకాశముండటంతో గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వీవీఐపీలు, రాజకీయ నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో నెత్తుటి మరకలు మహారాష్ట్రలో భద్రతాబలగాలు లక్ష్యంగా గతంలో మావోయిస్టులు చేసిన దాడులివే.. ► 2009, ఫిబ్రవరి 1: గడ్చిరోలి జిల్లాలోని మోర్కే గ్రామం వద్ద మావోలు జరిపిన దాడిలో గస్తీ బృందానికి చెందిన 15 మంది పోలీసులు దుర్మరణం. ► 2009, మే 21: మహారాష్ట్రలోని మురు మ్ గ్రామం వద్ద మావోల మెరుపుదాడి లో 16 మంది పోలీస్ సిబ్బంది మృతి. ► 2009, అక్టోబర్ 8: గడ్చిరోలిలోని లహేరీ వద్ద ఎదురుకాల్పులు. 17 మంది పోలీసులు దుర్మరణం. ► 2011, మే 19: భమ్రాగఢ్ తాలుకాలో మావోయిస్టుల మెరుపుదాడి. నలుగురు పోలీస్ సిబ్బంది మృతి. ► 2012, మార్చి 27: ధనోరాలో సీఆర్పీఎఫ్ బస్సును పేల్చివేసిన మావోలు. 12 మంది సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ జవాన్లు మృత్యువాత. మరో 28 మందికి తీవ్రగాయాలు. దోషులను వదిలిపెట్టం: మోదీ ‘గడ్చిరోలిలో మన భద్రతాసిబ్బందిపై మావోయిస్టుల హేయమైన దాడిని ఖండిస్తున్నా. ఈ హింసకు పాల్పడ్డ దోషులను వదిలిపెట్టబోం. అమరులైన వీరులకు నా సెల్యూట్. వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోం. అమరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని చెప్పారు. పిరికిపందల చర్య: రాజ్‌నాథ్ ‘తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన మావోలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. మావోల దుశ్చర్య విషయమై సీఎం ఫడ్నవీస్‌తో ఇప్పుడే మాట్లాడాను. మహారాష్ట్రకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. హోంశాఖ వర్గాలు గడ్చిరోలి జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాయి. ఈ దుర్ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీరి త్యాగం వృధాగా పోదు’ అని తెలిపారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: రాహుల్ ‘గడ్చిరోలీలో మన భద్రతాసిబ్బందిపై దాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘ఈ విషాద సమయంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మావోల హింసను వ్యతిరేకిస్తోంది. ఈ హింసాత్మక భావజాలాన్ని కలసికట్టుగా ఓడిస్తాం’ అని పేర్కొన్నారు. దాదర్పూర్లో మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలు -
మావోల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
గిద్దలూరు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా ముర్దొండ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరిలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరానికి చెందిన చట్టి ప్రవీణ్‌కుమార్ (24) ఉన్నారు. సేకరించిన సమాచారం ప్రకారం ప్రవీణ్ కుమార్ సహచర సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి వారి క్యాంపునకు సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. అందులో గౌతవరానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో పాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన గల్లిపల్లి శ్రీను మృతిచెందారు. ప్రవీణ్‌కుమార్ వినాయకచవితి పండుగ కోసం సెలవుపై స్వగ్రామం వచ్చి ఈనెల 15వ తేదీన తిరిగి విధులకు వెళ్లాడు. ఇంతలోనే కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, రంగలక్ష్మమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఉన్నతంగా చదివిం చుకోవాలన్న ఆశపడ్డామని... ఆర్థిక స్థోమత లేక సీఆర్పీఎఫ్ జవాన్‌గా పంపించామని.. చేతికి అందివచ్చిన కొడుకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌కు ఒక చెల్లెలు ఉంది. ప్రవీణ్ మరణ వార్తను సీఆర్పీఎఫ్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రవీణ్ మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు తెలిసింది. -
మావోయిస్టుల దాడి : ఆర్మ్ డ్ జవాన్ మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని ఆర్మ్డ్ శిబిరంపై మావోయిస్టులు గురవారం దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్ ఆర్మీడ్ ఫోర్స్‌కు చెందిన జవాన్ అశ్వీని సింగ్ రాజ్పుట్ మరణించాడు. ఈ మేరకు నారాయణపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆర్మ్ డ్ శిబిరం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి కాల్పులకు దిగారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీడ్ సిబ్బంది ఎదురుకాల్పులకు జరిపారు. ఈ కాల్పుల్లో జవాన్ అశ్వీన్ మరణించారని తెలిపారు. అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు జవాన్లు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని మీనా పేర్కొన్నారు. -
30 గంటలు పట్టింది!
రాయ్‌పూర్/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మృత దేహాల తరలింపునకు 30 గంటల సమయం పట్టింది. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగ్గా, ఆదివారం సాయంత్రానికి మతదేహాలను కాంకేర్‌లంక పోలీసు క్యాంపునకు తరలించారు. మతదేహాలను ఘటనాస్థలి నుంచి హెలికాప్టర్లలో తరలించేందుకు ప్రయత్నించారు. వాతావరణం సహకరించకపోవడం, మృత దేహాల కోసం వెళ్లిన పోలీసులపై నక్సల్స్ మళ్లీ దాడి చేయవచ్చనే అనుమానంతో ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఎఫ్(జిల్లా ఫోర్స) పోలీసులు ఆదివారం భారీ ఎత్తున కాలినడకన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను క్యాంపుకు, తర్వాత అక్కణ్ణుంచి జగ్దల్పూర్ తరలించారు. మావోయిస్టుల దాడి మృతులకు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, పోలీసు ఉన్నతాధికారులు జగ్దల్పూర్లో నివాళులర్పించారు. అల్పాహారం తీసుకునేందుకు సిద్ధమవుతున్నపుడు నాలుగువైపుల నుంచి మావోలు దాడికి తెగబడ్డారిన జగ్దల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు తెలిపారు. దాడి నుంచి తేరుకుని కాల్పులు ప్రారంభించేసరికే ఏడుగురు సహచరులను కోల్పోయామన్నారు. గ్రామం దగ్గర్లో దాడి చేయడంతో మావోలను తాము పసిగట్టలేదని, చాలామంది గ్రామీణుల వేషధారణలో ఉన్నారని వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది.ఈ ఘటనలో ఎ ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు మరణించారు. 11 మంది గాయాలతో బయటపడ్డారు. మృతదేహాల కోసం బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకోవడానికి ఆలస్యానికి గల కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు. చనిపోయిన జవాన్ల శవాల కోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు. మైనింగ్ కంపెనీపై దాడి సుక్మా జిల్లాలో ఏడుగురు జవాన్లను హతమార్చిన 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై మావోయిస్టులు దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు. కోరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దాస్పూర్ ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన సాయుధ నక్సలైట్లు కూలీలను వెళ్లగొట్టి మైనింగ్ యంత్రాలు, జేసీబీలు, జీపులు ఇతరత్రా మొత్తం 17 వాహనాలకు నిప్పుపెట్టారని కాంకేర్ ఎస్పీ జితేంద్రసింగ్ మీనా తెలిపారు. ఘటన అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సీ చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
శవాలకోసం వెళితే మళ్లీ కాల్పులు జరిపారు
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకుని, బేస్ క్యాంప్‌నకు తరలించాయి. ఎన్కౌంటర్ జరిగిన 24 గంటల తర్వాతగానీ మృతదేహాల తరలింపు సాధ్యపడకపోవడానికి గల కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు. చనిపోయిన జవాన్ల శవాలకోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు. కూంబింగ్ అనంతరం శనివారం మద్యాహ్నం బేస్ క్యాంపునకు తిరిగివస్తున్న ఛత్తీస్‌గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా 11 మంది గాయాలతో బయటపడ్డారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపునకు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థగానీ, బ్యాక్ అప్ ఫోర్స్ గానీ లేకపోవడంతో బుల్లెట్ దెబ్బలుతిన్న జవాన్లు ఊసురోమంటూ సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను చేరుకున్నాకగానీ ఎన్కౌంటర్ గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు! ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు జవాన్లు మరణించారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడినవారికి కాంచన్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ నేతలపై దాడి తరువాత మావోయిస్టులు.. పోలీసులను ఎన్కౌంటర్ చేయడం ఇదే ప్రథమం -
అమరులకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల మందుపాతరకు బలైపోయిన ఏడుగురు పోలీసుల అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య పోలీసులు గౌరవ వందనంతో అమరవీరులకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాధిత కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా చామూర్శి తాలూకా పవిమురాండా-మురమాడి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
జవాన్ల మృతికి షీండే,రమణ్ సింగ్ సంతాపం
-
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల మెరుపు దాడి
ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో గువ్వకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్యామగిరి కొండ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. శుక్రవారం కొవ్వకుండ - బచెలి రహదారిపై ప్రయాణిస్తున్న గస్తీ తిరుగుతున్న జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఎస్ఐతో పాటు ఐదురుగు జవాన్లు మృతి చెందారు. దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శ్యామగిరి ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.