ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. తాజాగా నిన్న (జనవరి 30)న ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల సమస్య ఈనాటిది కాదు. 2023 ఏప్రిల్ 26న నక్సలైట్ల దాడిలో 10 మంది డీఆర్‌జీ సైనికులు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల భారీ దాడి 2010 ఏప్రిల్ 6న జరిగింది. ఈ ఘటనలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది.
నక్సలైట్ల దాడిలో సామాన్యులు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో పలువురు రాజకీయ నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2023, మే 25న జరిగింది. ఆ రోజున జీరం వ్యాలీలో నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
2014, ఏప్రిల్ 12న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన నక్సలైట్ల దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, సామాన్యులకు నక్సలైట్లు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
2010 నుంచి నక్సల్స్ భారీ ఘాతుకాలు
2023, ఏప్రిల్ 26
దంతెవాడలో జరిగిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు.
2021, ఏప్రిల్
బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో 22 మంది సైనికులు వీరమరణం పొందారు.
2020, మార్చి
సుక్మాలో జరిగిన దాడిలో 17 మంది సైనికులు అమరులయ్యారు.
2017, ఏప్రిల్ 24
సుక్మాలో జరిగిన దాడిలో 25 మంది సైనికులు వీరమరణం పొందారు.
2017, మార్చి 11
సుక్మాలో జరిగిన దాడిలో 12 మంది జవాన్లు వీరమరణం పొందారు.
2017, మార్చి
దంతెవాడలో జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు.
2015, ఏప్రిల్
దంతెవాడలో జరిగిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు.
2014, ఏప్రిల్ 12
జీరం వ్యాలీలో జరిగిన దాడిలో 14 మంది సైనికులు వీరమరణం పొందారు.
2013, మే 25
జీరం వ్యాలీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 30 మందికిపైగా మృతి.
2010, ఏప్రిల్ 6
దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment