యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట తర్వాత సమీప ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇవి చూపరుల హృదయాలను కలచివేశాయి. ఎంతటి గుండెధైర్యం కలిగినవారైనా అన్ని మృతదేహాలను ఒకేచోట చూస్తే వారి మనసు కల్లోలమవుతుంది. ఒక కానిస్టేబుల్ ఇటువంటి అనుభవానికే లోనై, చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్ట్‌మార్టం హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహాలను అక్కడికి తీసుకురావడాన్ని గమనిస్తున్నాడు. అక్కడికి వస్తున్న మృతదేహాల సంఖ్య లెక్కకుమించి ఉండటానికి తోడు, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటడం రవికుమార్ మనసును తీవ్రంగా కలచివేశాయి.
అతనిలో గుండె దడ మొదలయ్యింది. కొద్ది క్షణాలకే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే తోటి కానిస్గేబుల్ లలిత్ కుమార్ అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించాడు. వైద్య చికిత్స తీసుకుంటూనే 20 నిమిషాల తర్వాత రవికుమార్ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి కుమార్ బన్నా దేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా సిద్ధార్థ్ నగర్‌లో నివసిస్తున్నాడు. 2022 నుండి అవగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. హత్రాస్ ప్రమాదం నేపధ్యంలో రవికుమార్‌ను ఎటా మెడికల్ కాలేజీ మార్చురీ వద్ద విధులలో నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment