ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మెరుపు దాడి | Six policemen killed in Naxal attack | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మెరుపు దాడి

Published Fri, Feb 28 2014 2:31 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

Six policemen killed in Naxal attack

ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో గువ్వకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్యామగిరి కొండ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. శుక్రవారం కొవ్వకుండ - బచెలి రహదారిపై ప్రయాణిస్తున్న గస్తీ తిరుగుతున్న జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఎస్ఐతో పాటు ఐదురుగు జవాన్లు మృతి చెందారు.

 

దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శ్యామగిరి ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement