లతా మంగేష్కర్
నేటి టెక్నాలజీ యుగంలో సెల్‌ఫోన్స్ లేని లైఫ్స్‌ని ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాలను ఆక్రమించాయి. అలాగే రోజుకో సెల్ఫీ అయినా ఫోన్ గ్యాలరీలో పడకపోతే యూత్‌కి నిద్రపట్టేలా లేదు. నిజానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో కూడా సెల్ఫీ అనే పదాన్ని 2013లో చేర్చారు. ఐదేళ్లుగా సెల్ఫీ ట్రెండ్ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ 1950లోనే సెల్ఫీ తీసుకున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్.
‘‘నమస్కారం. దాదాపు 68 ఏళ్ల క్రితమే నేను సెల్ఫ్ క్లిక్డ్ ఫొటో తీసుకున్నాను. ఇప్పుడు దీన్నే సెల్ఫీ అంటున్నారు’’ అని ఆమె ఆనాటి సెల్ఫ్ క్లిక్డ్ పిక్చర్ అదేనండీ.. ఇప్పటి భాషలో సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. గాయనిగా చాలా భాషల్లో ఎన్నో పాటలు పాడారు. ఎన్నో అవార్డులను గెల్చుకున్నారు. కానీ ఆమెలో ఈ ఫొటోగ్రఫీ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment