Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు | Year Ender 2024, Here's The List Of 8 Diseases And Viruses That Have Emerged In India | Sakshi
Sakshi News home page

Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు

Published Wed, Dec 4 2024 1:28 PM | Last Updated on Thu, Dec 12 2024 4:58 PM

Year Ender 2024 Some Diseases that have Emerged in India

2024వ సంవత్సరంలో చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదిలో దేశంలో కొన్ని నూతన వ్యాధులు అందరినీ వణికించాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్‌తో పాటు క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేసింది.

నిపా వైరస్: దీనిని జూనోటిక్ పారామిక్సోవైరస్ అని అంటారు. ఇది ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ వైరస్‌ వ్యాప్తి తొలిసారిగా 2018 మేలో కేరళలో కనిపించింది. ఈ వైరస్ గబ్బిలాలు లేదా పందుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.

జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి ద్వారా  ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలిసారిగా 2021 జూలైలో కేరళలో ఈ వైరస్‌ కనిపించింది.

క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో తొలిసారిగా ఈ వైరస్‌ కనిపించింది.

చండీపురా వైరస్: దోమలు, పేలు, ఈగల ద్వారా  ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలో ఈ వైరస్‌ కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కేసులు కనిపించాయి.  

డెంగ్యూ: ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో మొదటి  ఈ కేసు తొలిసారిగా 1780లో చెన్నైలో  కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

జపనీస్ ఎన్సెఫాలిటిస్: భారతదేశంలో ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2024లో తొలిసారిగా కనిపించింది.

క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ): భారతదేశంలో విస్తరిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్‌గా కేఎఫ్‌డీ మారింది.

ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు: హాంటావైరస్, చికున్‌గున్యా వైరస్, హ్యూమన్ ఎంట్రోవైరస్-71 (ఈవీ-71), ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్‌) కరోనావైరస్. 

ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్‌ఫుల్‌ బీమ్‌’.. గురి తప్పేదే లే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement