
2024 ముగియడానికి ఇక కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. జనమంతా న్యూ ఇయర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొందరు 2024లో తమకు ఎదురైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. 2024లో చాలామంది బరువు తగ్గేందుకు యోగాసనాలను ఆశ్రయించారు. కొన్ని ఆసనాలను వారు అమితంగా ఇష్టపడ్డారు.
మలాసనం
2024లో చాలామంది మలాసనం కోసం శోధించారు. దీనిని అభ్యసించి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకున్నారు. ఈ యోగాసనాన్ని స్క్వాట్ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. ఈ ఆసనం వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటి నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది.
పవనముక్తాసనం
పవనముక్తాసనం 2024లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ యోగాసనం అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అంతే కాదు ఈ యోగాసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే చాలా త్వరగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లనొప్పుల నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కల్పిస్తుంది.
తాడాసనం
2024 సంవత్సరంలో చాలామంది అత్యధికంగా శోధించిన యోగాసనాలలో తాడాసనం కూడా చోటు దక్కించుకుంది. ఈ యోగాసనం సహాయంతో శరీరంలోని పలు అవయవాలకు శక్తి సమకూరుతుంది. ఈ ఆసనం శరీరపు ఎత్తును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మత్స్యాసనం
చాలమంది ఈ ఏడాది మత్స్యసనం కోసం సెర్చ్ చేశారు. ఈ యోగాసనం శారీరక, మానసిక అభివృద్ధికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ, భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పొట్టను కరిగించడంలో సహాయపడుతుంది.
పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసం యోగాభ్యాసంలో ముఖ్యమైనదిగా చెబుతుంటారు. 2024లో చాలామంది ఈ ఆసనాన్ని వేసి లబ్ధి పొందారు. ఈ యోగాసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వెన్నెముక సమస్యలను పరిష్కరిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే, నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు