Order delivery
-
డెలివరీ ఫెయిల్: జొమాటోకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్‌ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్‌ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్‌లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్. -
నువ్వు తోపు బ్రదర్.. డెలివరీ బాయ్ సాహసానికి మహిళా కస్టమర్ ఫిదా!
ఓ వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. కదులుతున్న రైలును సైతం చేజ్ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును డెలివరీ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. వివిధ రకాల వస్తువులను హోమ్ డెలివరీ అందించే డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. కాగా, సదరు మహిళా కస్టమర్.. ఆ ఏజెంట్ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఘటన ముంబైలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్ వద్ద నిలబడిన ఓ మహిళ.. డంజో డెలివరీ బాయ్‌ను ఫాస్ట్.. ఫాస్ట్ అంటూ చేతులతో సైగలు చేసింది. దీంతో, అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్‌ను సదరు మహిళకు అందించాడు. ఆమె దానిని చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని ఒకరు.. అతడికి 10 టైమ్స్ టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు అని మరొకరు కామెంట్స్ చేశారు. Just Came Across This Viral Video. His Dedication Is Really Amazing! #DDLJ #TrendingReels #SRK #Dunzo @DunzoIt @iamsrk @itsKajolD pic.twitter.com/GfGp0zmQLF — Prathamesh Avachare (@onlyprathamesh) September 15, 2022 -
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
ఆర్డర్ డెలివరీకి బైకులు కావాలా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం... ఈ రోజుల్లో ఆన్లైన్ సంస్థలకు కొదవ లేదు. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవటమనేది ప్రతి సంస్థా చేస్తోంది. కాకపోతే తీసుకున్న ఆర్డర్‌ను డెలివరీ చేయటమే అసలైన సమస్య. ఎందుకంటే డెలివరీ కోసం ప్రతి సంస్థకూ సొంత లాజిస్టిక్స్ విభాగం ఉండాలి. లేకపోతే వేరొక లాజిస్టిక్స్ కంపెనీపై ఆధారపడాలి. దీన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు కిరణ్‌కుమార్ రెడ్డి. కార్ల అగ్రిగేటర్ ఉబెర్‌ను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ కేంద్రంగా బైకులకు అగ్రిగేటర్‌గా ఈ ఏడాది జులైలో సెండ్ఫాస్ట్.ఇన్ను ఆరంభించాడు. దీనికి సంబంధించి కిరణ్‌కుమార్ ఏమంటారంటే... ‘‘స్థానికంగా ఉన్న ఫార్మసీ దుకాణాలు, రెస్టారెంట్లు, గ్రోసరీ సంస్థల వద్ద మా సెండ్ఫాస్ట్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లో సరకులను ఎక్కడికి డెలివరీ చేయాలన్నది నమోదు చేస్తే చాలు. అందుబాటులో ఉన్న బైకర్ల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. వారికి కావాల్సిన బైకర్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఇందుకుగాను 5 కి.మీ. వరకు రూ.35, ఆ తర్వాత ప్రతి కి.మీ. మీద రూ.9 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ తాలుకు వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. సెండ్ఫాస్ట్లో బైక్‌ను రిజిస్టర్ చేసిన వారికి నెలకు రూ.11 వేలు వేతనంగా అందిస్తున్నాం. ప్రస్తుతం రెండు నగరాల్లో కలిపి నెలకు 7,000 మంది మా అప్లికేషన్‌ను వినియోగించుకుంటున్నారు. రోజుకు 500 ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇటీవలే లాంటెక్ ఫార్మా కంపెనీ యజమాని ప్రకాశ్ రెడ్డి మా సంస్థలో రూ.15 లక్షల పెట్టుబడులు పెట్టారు. విస్తరణ బాటలో పయనిస్తున్నాం..’’ అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...