ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై దారుణం | Delhi University student gang raped by classmate and friends, four detained | Sakshi
Sakshi News home page

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై దారుణం

Published Sat, Feb 25 2017 7:52 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై దారుణం

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్, అతని స్నేహితులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.  

శుక్రవారం బీఏ రెండో సంవత్సరం విద్యార్థిని తన స్నేహితుడి ఇంటికి వెళ్లింది. అక్కడ అతని స్నేహితులు ముగ్గురు ఉన్నారు. వారు ఆమెకు మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ ఇచ్చారు. విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లాక నలుగురూ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement