కడప రాజారెడ్డి వీధిలో నివసిస్తున్న శంకర్ స్థానిక ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని భార్య మంజుల రాయచోటి రోడ్డులోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. అదే పాఠశాలలో ట్రాఫిక్ కానిస్టేబుల్ భార్య కూడా ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. వీరిద్దరూ స్నేహంగా కూడా ఉండేవారు. రోజులాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ట్రాఫిక్ పాయింట్‌లో విధి నిర్వహణ కోసం వెళ్లారు. ఆయన భార్య, కుమార్తె పాఠశాలకు వెళ్లారు.
స్నేహితురాలి బ్యాగులో తాళాలు కొట్టేసి...
ట్రాఫిక్ కానిస్టేబుల్ భార్య వ్యానిటీ బ్యాగులోని ఇంటి తాళాలను శంకర్ భార్య మంజుల అత్యంత చాకచక్యంగా కొట్టేసింది. వాటిని భర్తకు అందజేసి చోరీకి పురమాయించింది. కానిస్టేబుల్ భార్య, కుమార్తె స్కూలుకు వచ్చేశారని మంజుల తన భర్తకు చెప్పడంతో అతను ఇదే అదనుగా భావించి కానిస్టేబుల్ ఇంటికి చోరీకి వెళ్లాడు. ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా ఇంటి తలుపులు తెరచి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు. లోపల సోదా చేయగా అతనికి ఏమీ దొరకలేదు.
ఇదే విషయాన్ని తన భార్య మంజులకు ఫోన్ చేసి ‘నేను బాలాజీనగర్‌లో కానిస్టేబుల్ ఇంట్లో ఉన్నాను. వెంటనే రమ్మంటూ’ చెప్పాడు. పాఠశాలలో జరుగుతున్న బాలల దినోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉండి మంజుల వెంటనే రాలేకపోయింది. తన భార్య ఇంకా వస్తోందంటూ ఇంట్లోనే ఉండిపోయాడు. అంతలోనే కానిస్టేబుల్ తన ఇంటికి వచ్చారు.
బయట చెప్పులుండగా, తాళం తెరచి ఉండడం చూసి అనుమానం వచ్చిన కానిస్టేబుల్ రెడ్ హ్యాండ్‌గా దొంగను పట్టుకున్నారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తాలూకా ఎస్‌ఐ మద్దిలేటి తెలిపారు.
శుక్రవారం ఉదయం 9 గంటలు.. కడప బాలాజీనగర్‌లోని రిలయన్స్ టవర్స్ వెనుకభాగం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నివాసం..ఆయన డ్యూటీకెళ్లగా..భార్య, కుమార్తె స్కూలుకు వెళ్లారు. ఇదే అదనుగా ఓ వ్యక్తి కానిస్టేబుల్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంచక్కా చోరీకి యత్నించాడు.
ఆలోపే టిఫిన్ కోసమని వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటి తాళం తెరచి లోపల ఎవరో ఉండటాని గమనించి అవాక్కయ్యారు. తలుపులు తీయగానే కానిస్టేబుల్‌ను చూసిన దొంగ ఠారెత్తిపోయాడు. కటకటాలపాలయ్యాడు.
- కడప అర్బన్
పంతులమ్మ దొంగబుద్ధి
Published Sat, Nov 15 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement