సిటీబస్సు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి | Traffic cop mowed down by city bus in Thane | Sakshi
Sakshi News home page

సిటీబస్సు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

Published Sat, Mar 12 2016 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

Traffic cop mowed down by city bus in Thane

ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సిటీబస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో జరిగింది. నగరంలోని ఘోడ్‌బందర్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో చంద్రకాంత్ వామన్ సాలుంకే అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు టీఎంటీ బస్సు అతడిని ఢీకొంది.

దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడని కాసర్‌వాడావాలి పోలీసు స్టేషన్‌ పీఎస్ఐ ఆర్‌కే ధమానే తెలిపారు. మహారాష్ట్రలోని పర్నేర్ ప్రాంతానికి చెందిన సాలుంకే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం థానె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీఎంటీ బస్సు డ్రైవర్ గజానన్ షేజ్వాల్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement