
చికిత్స అందిస్తున్న ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్
టీ.నగర్: ప్రమాదంలో గాయపడి స్పృహతప్పిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక చికిత్స చేసి కాపాడారు. ఎగ్మూర్ ఆదిత్యనార్ రౌంటానా సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనంలో అతి వేగంగా వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అక్కడ ఉన్న కాల్ ట్యాక్సీని ఢీకొన్నాడు. దీంతో ఆ వ్యక్తి కింద పడి స్పృహ తప్పాడు.
ప్రమాదం జరిగిన స్థలంలో ప్రజలు గుమికూడి ఏమి జరిగిందా అని తెలియని స్థితిలో అక్కడకు వచ్చిన ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు చొరవతీసుకుని స్పృహతప్పిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. తర్వాత సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చూసి స్థానికులు ట్రాఫిక్ పోలీసును అభినందించారు.