
మారేడుపల్లి : ఓ వాహనదారుడు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..కార్ఖానా జంక్షన్‌లో సుక్రిత్ అనే వ్యక్తి పర్సును పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మారేడుపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌కు పర్సు దొరికింది. అందులో ఉన్న ఆధార్‌కార్డు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఒరిజినల్ ఆర్‌సీల ఆదారంగా బాధితుడికి సమాచారం అందించాడు. పర్సును ట్రాఫిక్ సీఐ దస్రూకు అందజేశారు. శుక్రవారం సుక్రిత్‌కు సీఐ సమక్షంలో పర్సును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ దస్రూ కానిస్టేబుల్ వెంకటేష్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment