purse wallet
-
ఆ పని చేసిన జొమాటో బాయ్.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు!
సాధారణంగా మనం ఏదైన పని చేస్తున్నప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తే అంత ఈజీగా ఆ పనిని ముందుకు తీసుకు వెళ్లలేం. అలానే పనిలో ఉండగా పర్సు పోయినట్లు తెలిస్తే అప్పటికప్పుడు అన్ని పనులను పక్కన పెట్టి పోయిన పర్సు కోసం వెతుక్కుంటాం, అంతేనా. తాజాగా ఓ జొమాటో డెలివరీ బాయ్‌కి ఇదే పరిస్థితి ఎదురైతే తాను చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. మరి అంతగా ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే.. తనకు వచ్చిన ఫుడ్ ఆర్డర్‌ని తీసుకోవడానికి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్డర్ తీసుకుని తిరిగు ప్రయాణమవుతున్న సమయంలో అతని పర్సు పోయిందని గ్రహించాడు. అయితే పోయిన తన పర్సు కోసం ఆలోచించక తన చేస్తున్న పని పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు కదిలాడు. ఈ క్రమంలో ఆ డెలివరీ బాయ్ కస్టమర్‌కి కాస్త ఆలస్యంగా డెలివరీ చేశాడు. అందుకు అతను క్షమాపణలు కూడా కస్టమర్‌కు చెప్పాడు. ఈ విషయాన్ని సచిన్ కాల్బాగ్ అనే ఒక జొమాటో యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. వృత్తిపై అతని నిబద్ధత చూసి తనకు మతిపోయిందని మెచ్చుకున్నాడు. దీనిపై స్పందించిన జొమాటో ఇలాంటి డెలివరీ పార్టనర్లతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ ఆర్డర్ వివరాలు తమకు మెసేజిలో పంపితే అతనికి సహాయం అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ట్విటర్లో అతని కథ వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. Hi @zomato @deepigoyal, mindblown by Manish Bhageluram Gupta's work ethic. He accidentally dropped his wallet at a restaurant where he picked up our food. It was stolen. Instead of waiting there, he came to our house to deliver our order, and even said sorry for the short delay. pic.twitter.com/N6DBiRo91h — Sachin Kalbag (@SachinKalbag) October 16, 2021 -
మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయతీ
సాక్షి,సిటీబ్యూరో: విధినిర్వహణలో ఉన్న సమయంలో తనకు దొరికిన పర్సును బాధితురాలికి అందజేసి ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయతీ చాటుకుంది. బుధవారం ఉదయం కూకట్పల్లి జేఎన్టీయూ జంక్షన్ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లీశ్వరికి ఓ పర్సు కనిపించింది. అందులో రూ.5950 నగదు, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించింది. పర్సులో ఉన్న ఒక స్లిప్పులో ఎస్బీఐ అకౌంట్ నెంబరు ఉండటంతో నంబర్ ఆధారంగా బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాదారు ఎన్. కవితగా గుర్తించిన ఆమె బ్యాంకు అధికారుల నుంచి నెంబరు తీసుకొని ఫోన్‌చేసింది. మంజీరా మాల్లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న కవిత తన నెలజీతాన్ని పర్సులో దాచుకుంది. పర్సు పోగొట్టుకొని ఆందోళనలో ఉన్న కవితకు పర్సును అందజేసి మల్లీశ్వరి నిజాయితీని చాటుకోవడంతో ఆమెను అభినందించారు. -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
మారేడుపల్లి : ఓ వాహనదారుడు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..కార్ఖానా జంక్షన్లో సుక్రిత్ అనే వ్యక్తి పర్సును పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మారేడుపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌కు పర్సు దొరికింది. అందులో ఉన్న ఆధార్‌కార్డు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఒరిజినల్ ఆర్సీల ఆదారంగా బాధితుడికి సమాచారం అందించాడు. పర్సును ట్రాఫిక్ సీఐ దస్రూకు అందజేశారు. శుక్రవారం సుక్రిత్‌కు సీఐ సమక్షంలో పర్సును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ దస్రూ కానిస్టేబుల్ వెంకటేష్‌ను అభినందించారు. -
పర్సులో డబ్బులుంటే ఇచ్చేస్తారట
పర్సు పోయిందనుకోండి.. అందులో డబ్బు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఆ డబ్బులు తీసుకుని పర్స్ పడేస్తారు. ఒకవేళ డబ్బులేమీ లేకపోతే.. ఆ ఏముంది.. ‘బ్రదర్ మీ పర్సు కింద పడింది.. తీసుకోండి అని తిరిగిచ్చేస్తారు’అంతే కదా.. మీరనుకునేది. పర్సులో డబ్బు ఎంత ఎక్కువ ఉంటే నిజాయితీ అంత తక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదట. పోగొట్టుకున్న పర్సులో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత నిజాయితీ ఉంటుందట. దాదాపు 40 దేశాల్లో 355 నగరాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. డబ్బులకు, మానవ సైకాలజీకి మధ్య సంబంధం గురించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరితో పాటు యూనివర్సిటీ ఆఫ్ జురిచ్, యూనివర్సిటీ ఆఫ్ ఉతాకు చెందిన పరిశోధకులు కూడా పాల్గొ న్నారు. నిజాయితీగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్, నార్వే టాప్‌లో ఉండగా, పెరూ, మొరాకో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి. ఈ అన్ని దేశాల్లో మాత్రం ఒకే విషయం కామన్‌గా ఉందట. అదేంటంటే డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ పర్స్‌ను తిరిగి ఇచ్చేస్తారని తేలిందట. సాధారణంగా ఎవరైనా పర్స్ పోగొట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది తిరిగి ఇస్తారట. అయితే అందులో డబ్బులు ఉంటే మాత్రం 51 శాతం మంది పర్స్ తిరిగిచ్చేస్తున్నారట. ఈ పరిశోధన నిర్వహించేందుకు చాలా డబ్బు వెచ్చించారట. బ్యాంకులు, థియేటర్లు, మ్యూజియంలు, పోస్ట్ ఆఫీస్‌లు, హోటల్స్, పోలీస్ స్టేషన్స్, కోర్టులు తదితర 17 వేలకు పైగా ప్రాంతాల్లో దాదాపు డబ్బులను పర్సులో పెట్టి జారవిడిచారట. అందుకోసం దాదాపు రూ.4 కోట్లకు పైగా డబ్బు వెచ్చించారట. అయితే చాలా మంది అందులో డబ్బు ఎక్కువగా ఉందని తిరిగిచ్చారట. అదండీ విషయం.. డబ్బు అందరినీ చెడ్డవారిని చేయదండోయ్! -
ఆన్లైన్ సేవలను విస్తృతం చేస్తాం
విజయవాడ: రాష్ట్రంలో ఆన్లైన్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఉపాధి కల్పించేందుకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేస్తామని, మొబైల్ కరెన్సీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 'మొబైల్ కరెన్సీకి 13 వ్యాలెట్ కంపెనీలు ముందుకొచ్చాయి. పర్స్ వ్యాలెట్ ద్వారా నగదు రహిత చెల్లింపులకు కార్యాచరణ చేపట్టాం. నగదు రహిత లావాదేవీలపై వివిధ సర్వీసు ప్రొవైడర్స్‌తో చర్చించాం. సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా ఏపీ పర్స్ వ్యాలెట్ పరిధిలోకి రావాలి. నగదు రహిత చెల్లింపులపై అవగాహనకు ఓ కమిటీ వేశాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.