ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేస్తాం | we will extend online services, says cm chandrababu | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేస్తాం

Published Sat, Nov 26 2016 12:02 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేస్తాం - Sakshi

ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేస్తాం

విజయవాడ: రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఉపాధి కల్పించేందుకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేస్తామని, మొబైల్ కరెన్సీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

'మొబైల్ కరెన్సీకి 13 వ్యాలెట్ కంపెనీలు ముందుకొచ్చాయి. పర్స్ వ్యాలెట్ ద్వారా నగదు రహిత చెల్లింపులకు కార్యాచరణ చేపట్టాం. నగదు రహిత లావాదేవీలపై వివిధ సర్వీసు ప్రొవైడర్స్‌తో చర్చించాం. సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా ఏపీ పర్స్ వ్యాలెట్ పరిధిలోకి రావాలి. నగదు రహిత చెల్లింపులపై అవగాహనకు ఓ కమిటీ వేశాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement