సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌ను ప్రశంసించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్ సమయంలో పరీక్షా కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్.. సురేష్‌ను అభినందించారు.
కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా..
‘వాహనాల నియంత్రణ మాత్రమే…
తన డ్యూటీ అనుకోకుండా…
సాటి మనిషికి సాయం చేయడం…
తన బాధ్యత అని భావించిన…
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు…
నా అభినందనలు.
సురేష్ సహకారంతో…
సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి…
యూపీఎస్సీ పరీక్షలో…
విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్స్ చేశారు.
జరిగింది ఇది..
యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతికి ఆలస్యం కావడంతో బైకుపై పరీక్షా సెంటర్ వద్ద దిగబెట్టాడు. మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉన్న ఓ యువతి.. ఆర్టీసీ బస్సులో మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరంలో ఉండటంతో సమయం మించిపోతుండటంతో ఆమె కంగారు పడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమె ఆందోళనను గుర్తించి ఆమె వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బైక్‌పై ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment