
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకుంటున్న ప్రసాద్
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన కాశిబోయిన ప్రసాద్ బాల్యం నుంచి కవితలు రాస్తున్నాడు. అతని ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించారు. దీంతో సృజనకు పదును పెట్టి ఎన్నో కవితలను రాశాడు. ఆశువుగా కూడా కవితలను చెప్పగలడు. ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు కవితలు రాస్తూ రాణిస్తున్నాడు. వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అనేక బిరుదులు, సత్కారాలు అందుకున్నాడు. సేవకార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తాను చదువుకున్న గౌరిదేవిపేట పాఠశాలలో ప్రతి ఏడాది 10వ తరగతిలో ప్ర£ýథమస్థానాన్ని సాధించిన వారికి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.వెయ్యి నగదు, ద్వితీయ స్థానం సాధించిన వారికి సిల్వర్ మెడల్‌తో పాటు రూ.వెయ్యి నగదును అందిస్తున్నాడు.
జనవరి 26న ఇద్దరు గురువులను, ఒక విద్యార్థిని సన్మానించడంతో పాటు రూ.20వేలు విలువ చేసే క్రీడా సామగ్రి, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నాడు. గత పదేళ్లుగా విద్యార్థులకు 8వందల టీ షర్టులను అందించాడు. చర్చిలకు, పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు గడియారాలను అందజేస్తున్నాడు. బడిమానేసిన ఆకతాయిగా తిరుగుతున్న గిరిజన పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం పొందాడు. 2010లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పాల్గొని సత్కారం పొందాడు. 2008లో కరీంనగర్ ఎస్పీ నుంచి ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment