సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ట్రోలింగ్‌లపై 20 కేసులు నమోదు నమోదు చేశామని, మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్పింగ్ చేసి ట్రోలింగ్ చేశారని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ పెద్దలపైనా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా కంటెంట్‌ను పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్నేహా మెహ్రా హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారిలో అట్టాడ శ్రీనివాసరావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను, పెరక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్ ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment