సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్: ప్రేమ నిరాకరించిన అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాళ్లకు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది నుంచి గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నూకటి సురేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.
సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి కథనం ప్రకారం... నూకటి సురేశ్ బాధితురాలైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బాధితురాలి ఫేస్‌బుక్‌తో పాటు ఆమె ఫ్రెండ్స్ ఫేస్‌బుక్ ఖాతాలోకి వెళ్లి బాధితురాలి ఫొటోలను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి బాధితురాలితో పాటు ఆమె స్నేహితులకు వాట్సాప్‌కు పంపాడు. నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోలతో పాటు వాట్సాప్ నంబర్ పోస్టు చేశాడు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.