banjara hills ps
-
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై చీటింగ్ కేసు
సాక్షి,బంజారాహిల్స్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ జ్ఞానేశ్వర్ నాయు డు అలియాస్ జీవీజీ నాయుడుతో పాటు మ రొకరిపై జూబ్లీహిల్స్ పో లీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70 జర్నలిస్టు కాలనీలో ముంబైకి చెందిన రోనక్ కొటేచాకు అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఓ ఫ్లాట్‌ను ఫోర్జరీ పత్రాలు, నకిలీ సంతకాలు, నకిలీ ముద్రలతో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడుతో పాటు పీసీహెచ్ ఈ–జోన్ యజమాని బల్వీందర్ సింగ్ కబ్జా చేశారు. ఈ ఫ్లాట్‌ను బల్వీందర్ సింగ్ 2013లో రొనక్ కొటేచాకు విక్రయించాడు. రొనక్ కొటేచా ముంబైలో బిజీ వ్యాపారి కాగా ఇక్కడికి రాలేకపోవడంతో ఇదే అదునుగా భావించిన జీవీజీ నాయుడు సదరు ఫ్లాట్‌ను ఆక్రమించి అందులో తిష్టవేశాడు. ఫోర్జరీ పత్రాలు క్రియేట్ చేసి సిటీ సివిల్ కోర్టులో ఫ్లాట్ తనదేనంటూ నకిలీ పత్రాలు సమర్పించి కేసు వేశాడు. విషయం తెలుసుకున్న రొనక్ పలుమార్లు తన ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందిగా జీవీజీ నాయుడుకు విజ్ఞప్తి చేశాడు. అయితే నాయుడు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టాడు. తాను టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుడినని తనను ఎవరు ఏం చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటువైపు తొంగిచూస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీవీజీ నాయుడు, బలి్వందర్ సింగ్‌లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి జీవిజీనాయుడు కోసం గాలిస్తున్నారు. చదవండి: పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నాగరాజుపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్ పేరు చెప్పి నాగరాజు నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు గతంలో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014– 16 మధ్య ఏపీ రంజీ జట్టుకు ఎంపికైన బుడుమూరు నాగరాజు.. గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడ్డాడు. బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా దండుకున్నాడు. ఈ ఘరానా నేరగాడు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన కేటీఆర్ పేరు చెప్పి రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఇలా నాగరాజు నేరాల చిట్టా చాంతాండంత ఉంది. ఇతనిపై బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్, మాదాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి పోలీస్స్టేషన్లతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరు, న్యూఢిల్లీలలో కేసులు నమోదై ఉన్నాయి. చదవండి: Wrestler Sushil Kumar: తీహార్ జైలుకు తరలింపు.. -
వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్ : వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బంజారాహిల్స్‌లోని కృష్ణానగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్‌హౌస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రఘును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పిటా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. -
బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 'బ్రాండ్ బాబు' సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. -
బాల్క సుమన్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్‌లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్‌పై దాడికి యత్నించారు. ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు: బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్ ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన -
ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై రెండు రోజులుగా వైరల్ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్‌ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్ సునీల్ పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. -
పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. కొన్ని న్యూస్ చానళ్ల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా పవన్ ప్రవర్తించారంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. చానళ్లలో ప్రసారం కానీ వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ అంశంపై విచారణ చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పవన్ కల్యాణ్‌పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నా వెనుక ఎవరూ లేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషను అపహాస్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ వీ6 చానెల్ తీన్మార్ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై సోమవారం దాడికి పాల్పడిన మణికంఠను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. గత కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని వీ6 చానెల్ వద్ద రెక్కి నిర్వహించి మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బిత్తిరి సత్తిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చానల్ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడిని సికింద్రాబాద్‌కు చెందిన కలాసిగుడకు చెందిన మణికంఠగా గుర్తించారు. సత్తి వాడే భాష తెలంగాణ యాసను వెక్కిరిస్తున్నట్టు ఉందని అందుకే దాడి చేసినట్లు తెలిపాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపాడు. తన వెనుక ఎవరూ లేరని అతను పేర్కొన్నాడు. బిత్తిరి సత్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘నిజాయితీ’ చావాలనుకుంది!
* ఎస్బీ కానిస్టేబుల్ నారాయణరావు ఆత్మహత్యాయత్నం * గతంలో సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్న నారాయణరావు * ఉన్నతాధికారి వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు సాక్షి, హైదరాబాద్ : ‘శభాష్ పోలీసన్నా’ అని సీఎం కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గతంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించిన నారాయణరావుకు... అప్పటినుంచి వెస్ట్‌జోన్ ఎస్బీ విభాగం అధికారి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ చర్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నారాయణరావు, సీఎం కేసీఆర్‌ను కలసినప్పటి నుంచి ఆ అధికారి అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు మామూళ్లు తేవాలని ఒత్తిడి చేస్తుండేవారని, అందువల్లే నారాయణరావు నిద్రమాత్రలు మింగారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపులు భరించలేకే..: నారాయణరావు నిజాయితీపరుడైన అధికారని.. చాలా సౌమ్యుడని.. అలాంటి వ్యక్తిని వెస్ట్‌జోన్ ఎస్బీ విభాగం అధికారి దూషించడం.. ఆయనను మనస్తాపానికి గురిచేసిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. లంచాలు తీసుకోవద్దని నారాయణరావు చెబితే, మామూళ్లు తేవాల్సిందేనని ఆ అధికారి వేధించేవాడని. శనివారం కూడా వీరిమధ్య వాదులాట జరిగిందని సమాచారం. దీంతో నారాయణరావు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో జనాలు లేని ప్రాంతానికి వెళ్లి వెంట తెచ్చుకున్న 20 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు నారాయణరావుని అమీర్‌పేటలోని ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
ఉత్తమ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం