పవన్ కల్యాణ్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. కొన్ని న్యూస్ చానళ్ల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా పవన్ ప్రవర్తించారంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. చానళ్లలో ప్రసారం కానీ వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ అంశంపై విచారణ చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పవన్ కల్యాణ్‌పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment