
సాక్షి, హైదరాబాద్: తమ అభిమాన హీరోపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్‌కల్యాణ్ అభిమాని పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంజగుట్ట కాలనీ, బత్తిన అపార్ట్‌మెంట్‌కు చెందిన శశాంక్ వంశీ పవన్ కల్యాణ్ అభిమాని. ఇటీవల పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో గాయపర్చాయని శశాంక్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు అతను చెప్పారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాక ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ప్రియాంక అనే పవన్ అభిమాని శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment