
పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు
డిచ్‌పల్లి, సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఎస్సై చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం డిచ్‌పల్లి, నిజామాబాద్‌కు చెందిన న్యాయవాదులు రవికుమార్, మధు నిజామాబాద్ రెండో అదనపు జ్యుడిషియల్ కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ డిచ్‌పల్లి పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 506 కింద కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.