
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కొడంగల్‌లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలే దని వ్యాఖ్యానించారు. బట్టకాల్చి మీద వేయ డం, బురద చల్లడం రేవంత్‌రెడ్డికి అలవాటు అని, ఆయన నోరు తెరిస్తే వేల కోట్ల రూపాయల కుంభకోణం అని మాట్లాడతారని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సుమన్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఇంటర్ ఫలితాల్లో కొంత సాంకేతిక సమస్య వచ్చింది నిజమే.
అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు విద్యా శాఖకు లింక్ ఎలా పెడతారు? 2017 సెప్టెంబరు 27న గ్లోబరీనాకు రూ.4.30 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇది విద్యాశాఖ పరిధిలోని అంశం. గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏంటి? ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు. ప్రజలకోసం కాకుండా వాళ్లకోసం ఆందోళన చేస్తున్నా రు. గ్లోబరీనా, మాగ్నేటిక్ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించింది. ఇంటర్ బోర్డులో కొంత మంది అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగా గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది’అని సుమన్ అన్నారు.