
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజకీయ జీవితం తన గడ్డంలో ఉన్న ఒక వెంట్రుకతో సమానమని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీ సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానిం చారు. సుమన్‌కు దూకుడు బాగా ఎక్కువైందని, కేసీఆర్ మెప్పు కోసం చేస్తున్న ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్నారు. ఆయన గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.
‘ఓయూలో ఇద్దరు ముగ్గురు విద్యా ర్థులను చంపి, ఆ మృత దేహాల చేతుల్లో సుమన్ లేఖలు పెట్టినట్టు నాకు సమాచారం ఉంది. సుమన్‌ను విడిచిపెట్టేది లేదు. మా పార్టీ అధికా రంలోకి వచ్చాక ఈ విషయంలో విచారణ జరిపి స్తాం’ అని అన్నారు. కేసీఆర్ మెప్పు కోసం స్థాయి మరిచి మాట్లాడుతున్న సుమన్‌కు దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందుకు గన్‌మెన్లు లేకుండా రావాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి సుమన్‌కు అవసరం లేదని, రేవంత్‌కు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయన్న విష యాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సూచించారు. విద్యార్థి నాయకుడిగా వచ్చిన సుమన్ విద్యార్థుల కోసం కొట్లాడుతాడో, కేసీఆర్‌కు భజన చేస్తాడో తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
అనుమతి కోసం ఐదు రోజులా?
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ పర్య టన కోసం అనుమతి అడిగి ఐదు రోజులవుతున్నా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని జగ్గారెడ్డి విమర్శిం చారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని టీఆర్‌ఎస్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు వీసీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పర్యటనపై చర్చించేందుకు ఈనెల 30న విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తు న్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. సమావేశంలో ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మానవ తా రాయ్, చెనగోని దయాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment