
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్‌ఎస్ తమ గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని, స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంఖ్యా బలం ఆధారంగా సమయమిస్తారని, అందులో భాగంగా కాంగ్రెస్‌కు 5 నిమిషా లు ఇవ్వాల్సి ఉండగా అదనంగా 10 నిమిషాలు కేటాయించారని తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment