
బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్(ఫైల్ ఫొటో)
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ (60) శుక్రవారం మృతి చెందారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ (60) శుక్రవారం మృతి చెందారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సురేశ్ మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. కాగా, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే బాల్కసుమన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. టీఆర్‌ఎస్‌లో సురేశ్ చురుకైన పాత్ర పోషించారని శ్లాఘించారు.
చదవండి: ఒక్క ఛాన్స్.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు!
కోవిడ్ మృతులకు రూ.4 లక్షల సాయం ఉత్తిదే..