విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న కుంభకోణాలు తాను ప్రశ్నిస్తే టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాత్రం వివరణ ఇవ్వకుండా తిట్లదండకం మొదలుపెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. మతితప్పినప్పుడు శృతితప్పిన మాటలు ఎలా ఉంటాయో బాల్క సుమన్ మాటలు చూస్తే తెలిసిపోతుందని విమర్శించారు.