
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీఆర్‌ఎస్ మంత్రులు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 29 జిల్లా కార్యాలయాలకు సోమవారం రోజున శంకుస్థాపన నిర్వహించింది. అయితే ఈ నిర్మాణాలకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన వంతు విరాళం అందించారు. ఎమ్మెల్యేగా తన ఒక నెల జీతం 2,50,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. మంగళవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన సుమన్ ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని సుమన్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
మరోవైపు టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి పార్టీ తరఫున కొంత మొత్తం కేటాయించినప్పటికీ.. వాటిని అన్ని వసతులతో ఆదర్శంగా నిర్మించుకోవాలనే తలంపుతో పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తమ వంతుగా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment