ఖజానా జువెలర్స్‌ భారీ విరాళం | Khazana Jewellery Donated 3 Crores For Care Of Coronavirus | Sakshi
Sakshi News home page

ఖజానా జువెలర్స్‌ భారీ విరాళం

Published Sat, Sep 12 2020 4:24 AM | Last Updated on Sat, Sep 12 2020 4:24 AM

Khazana Jewellery Donated 3 Crores For Care Of Coronavirus - Sakshi

మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేస్తున్న కిశోర్‌కుమార్‌. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్‌ అండగా నిలిచింది. కరోనాను అంతమొందించేందుకు తనవంతుగా రూ. 3 కోట్లు అందించింది. ఆ చెక్కును హైదరాబాద్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో ఖజానా జువెలర్స్‌ కిశోర్‌కుమార్‌ అందించారు. ఈ నిధిని కరోనా నిర్మూలన, కరోనా బాధితుల సంరక్షణలో భాగంగా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వినియోగించాలని కిశోర్‌కుమార్‌ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఖజానా జువెలర్స్‌ కిశోర్‌ కుమార్‌ను మంత్రులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement