
సాక్షి, జగిత్యాల: మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రోడ్డు మార్గాన మెట్‌పల్లి చేరుకున్న సీఎం రేగుంటలో సుమన్‌ను పరామర్శించి సురేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సుమన్ కుటుంబ సభ్యులను కలిసి సురేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. అక్కటి నుంచి సీఎం హైదరాబాద్ బయల్దేరారు. కాగా మెట్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment