సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్‌ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్‌ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.
పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment