సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా’ అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముమ్మాటికి చంద్రబాబు ఏజెంటే అని ఆరోపించారు. ఆయన సింగపూర్ ఆస్తుల్లో రేవంత్ రెడ్డి బినామీ అని, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు డబ్బుతోనే రేవంత్ రెడ్డి దొరికారన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ, ఆర్థిక అరాచక వాదని, తెలంగాణకు పట్టిన చీడపురుగని మండిపడ్డారు. డొల్ల కంపెనీలు, అక్రమాస్తులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఏమన్నారంటే.. ‘చంద్రబాబే కేసీఆర్‌ను ఏం చేయలేకపోయారు. అలాంటిది నీవెంతా?. కేసీఆర్ వేల ఎకరాల ఫామ్ హౌస్ చూపిస్తావా? లేకపోతే అక్కడే బొందపెట్టాలా. అడ్డగొలుగా మాట్లాడితే తాట తీస్తా. బాగా ఎగిరిపడుతున్నావ్. నీ గురించి ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కలిసి ఐటీ దాడులు చేపిస్తారా? మా పఠాన్‌చెరువు ఎమ్మెల్యే, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. వారికి లెక్కల్లో తేడా ఉంటే.. నోటీసులిచ్చి సోదాలు చేస్తారు. దీనికి టీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం. నీ గురించి ఎవరికి తెలియదు. ఎన్ని బ్లాక్‌మెయిల్ పనులు చేశావ్.. నీ దోస్తులను ఎలా మోసం చేశావో తెలియదనుకుంటున్నావా? నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన తెలంగాణలో, విషపు మొక్కలా చంద్రబాబు ఏజెంట్‌లా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావ్.
మిమ్మల్ని తిట్టడం మాకు రాదా? నీ తప్పుల గురించి రాసిన విలేకరులను, మీడియా సంస్థలను తిడతావా? నీవు తప్పు చేస్తే తప్పు అనవద్దా? దమ్ముంటే విచారణ ఎదుర్కో? ఇప్పటికైనా పద్దతిగా, సంస్కారవంతంగా మాట్లాడు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్? నాకు విలువలున్నాయి. ఉద్యమ ప్రస్థానం నాది. వ్యక్తిగతంగా మాట్లాడితే నీ బండారం అంతా బయట పెడుతా. నీ చరిత్ర మొత్తం తెలుసు. చేసిన అక్రమాలు, అన్యాయాలను ఒప్పుకొని ప్రజలను క్షమాపణ అడుగు. ఐటీ, ఇతర సంస్థలు చేస్తున్న విచారణకు సహకరించు. దమ్ముంటే విచారణను ఎదుర్కో. అసెంబ్లీలో బాల్కసుమన్... లేక రేవంత్ రెడ్డి కూర్చుంటాడా చూద్దాం.. కొడంగల్‌ల నీవు గెలుస్తావా? చెన్నూర్‌ల నేను గెలుస్తనా? కాంగ్రెస్‌కు ఎన్నిసీట్లు వస్తయో రెండునెలల్లో ప్రజలే తేలుస్తారు. ఎందుకు ఎగిరిపడుతున్నావ్. పోలీస్ అధికారులను, ఇంటలిజెన్స్ అధికారులను కూడా తిడతా ఉన్నావ్. కులం పేరుతో తెలంగాణలో విద్వేశపూరితమైన వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్. ఆంధ్రలో ఉన్నట్లుగా కులగజ్జి తెలంగాణలో లేదు. మాది ఉద్యమ పార్టీ నిస్వార్ధంగా నిలబడ్డాం కాబట్టే తెలంగాణ వచ్చింద’ని బాల్కసుమన్ ఆగ్రహంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment