
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గజ్జెల కాంతం, ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య, విజేత అనే మహిళలను శారీరకంగా లోబర్చుకున్నారని బాల్క సుమన్‌పై కేసు నమోదైందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment