Gajjela kantam
-
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్‌లకు కోవర్టులున్నారని, వారంతా ఎప్పటికప్పుడు ఆ ఇద్దరితో టచ్‌లో ఉంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం గాంధీభవన్ ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో ఇద్దరు నాయకులు, హైదరాబాద్‌లో మరో ముగ్గురు నేతలు టీఆర్ఎస్ కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్ నేతలు కేటీఆర్‌కు, హైదరాబాద్ నాయకులు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో గత నాలుగు పర్యాయాలుగా కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్లో టీఆర్ఎస్కు కోవర్టుగా ఉన్న నాయకుడే గెలిపిస్తున్నారని, అందుకే నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ టికెట్ ఇప్పించారని ఆరోపించారు. ఇటు చొప్పదండిలో 6 నెలల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులే.. జిల్లాకో రెండు, మూడు సీట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆ ఐదుగురు అడ్డుకుంటున్నారని గజ్జెల కాంతం ఆరోపించారు. టీఆర్ఎస్ 10–15 మంది ఉద్యమకారులకు న్యాయం చేసిందని, విద్యార్థి నేతలకు సైతం టికెట్లిచ్చిందని, మరి కాంగ్రెస్ ఎంతమందికి టికెట్లిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కోవర్టులు కోట్లు దండుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని, హైకమాండ్‌కు తప్పుడు సమాచారమిచ్చి మోసం చేస్తున్నారన్నారు. ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థులకు టికెట్లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ చెప్పినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలతో బయటపెడతాం.. కోవర్టులెవరో పేర్లు చెప్పాలని విలేకరులు ప్రశ్నించగా.. తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థి నేతలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గజ్జెల కాంతం చెప్పారు. అక్కడ అన్ని విషయాలను సాక్ష్యాలతో సహా బయటపెడతామన్నారు. భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్‌కు అమ్ముడుపోయారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు, ముగ్గు రు సీనియర్ నేతలు కేసీఆర్‌కు అమ్ముడుపోయా రని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. కేసీఆర్ ఆదేశానుసారం కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులకు టికెట్లు దక్కేలా వారు వ్యవహరిస్తున్నారన్నారు. హైకమాండ్ వెం టనే దీనిపై దృష్టి సారించి పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా, నిజమైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పోరాటం చేస్తే ఆ సీనియర్ నేతలు సహించట్లే దని తెలిపారు. పార్టీలోని కేసీఆర్ కోవర్టులను తొలగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేపు ఢిల్లీకి ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. అభ్యర్థుల ఖరారు కోసం అధిష్టానంతో చర్చించేం దుకు గాను ఆయన ఈ నెల 12న హస్తినకు వెళతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఆయన తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, ముఖ్య నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఖరారైన 74 స్థానాలతో పాటు, తుది నిర్ణయం తీసుకోవాల్సిన 19 స్థానాల విషయంలో వీరు అధిష్టానంతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. -
ఆ హామీలకే దిక్కు లేదు.. కొత్త మేనిఫెస్టోనా?
సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల మేని ఫెస్టో హామీలను నెరవేర్చకుండా కొత్త మేనిఫె స్టోను ఏవిధంగా విడుదల చేస్తారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న హామీ తో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులను నమ్మించి మోసం చేయడంతో పాటు అవమానించారన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో పేదలకు 9 నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే టీఆ ర్ఎస్ ప్రభుత్వం కేవలం రెండింటికి పరిమితం చేసిందన్నారు. మహాకూటమిని చూసి కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చక టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని.. ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
‘టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే విద్యార్థులతో టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లా డుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ప్రజలంతా ఆహ్వానిస్తుంటే.. ఓయూలోని కొంద రు విద్యార్థులు మాత్రం రెండ్రోజుల నుంచి హడావుడి చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు చనిపోతే పరామర్శకు రాహుల్ రాలేదని విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, అసలు విద్యార్థులు చనిపోయేలా రెచ్చగొట్టింది ఎవరో గమనించాలని కోరారు. చనిపోతేనే తెలంగాణ వస్తుందనే వాతావరణా న్ని ఆనాడు కేసీఆర్ కుటుంబమే సృష్టించిందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేస్తు న్న మోసాలను ప్రశ్నించడానికే రాహుల్ వస్తున్నారని, విద్యార్థులంతా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. -
టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేసినట్లు?: గజ్జెల కాంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఒక్క ఎంపీ ఉంటేనే తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు 20 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉండి తెలంగాణకు ఏం చేసినట్లని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. నాడు ఒక్క ఎంపీనే తెలంగాణ సాధించగలిగితే, నేడు 20 మంది ఎంపీలుండి రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌తో కలసి గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో నాలుగేళ్లుగా టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తు న్నా, ప్రధాని మోదీ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా మాట్లాడినా కనీసం తెలిపే దమ్ము కూడా టీఆర్ఎస్ ఎంపీలకు లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో ఉన్న 17 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీ లు ఏనాడైనా దళితుల సంక్షేమం గురించి సీఎంతో మాట్లాడారా అని ప్రశ్నించారు. నేరెళ్ల వంటి ఘటనలను కూడా ఖండించలేదన్నారు. -
మాయల మరాఠీ సర్కార్‌కు గుణపాఠం తప్పదు
కరీంనగర్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ను అమలు చేయకుం డా మభ్యపెడుతున్న మాయలమరాఠీ సర్కార్‌కు గుణపాఠం చెప్పేం దుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం విమర్శించారు. గురువారం అర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధి కారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాటికి తిలోదకాలు ఇచ్చి ధనార్జనే ధ్యేయంగా అవినీతి పాలన సాగి స్తోందని ఆరోపించారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల పేరిట ప్రజలను మభ్యపెడుతూ మరోసారి అధికారంలోకి రావాలని కంటున్న కలలు నెరవేరబోవన్నారు. సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రభుత్వం తహతహలాడుతోందని, ఎన్నికలంటే సీఎంకు భయం పట్టుకుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లీస్తూ.. దళిత గిరిజనులను దగా చేసిన టీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో భారీ మూల్యం తప్పదని హెచ్చరించా రు. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ తీరును ప్రజలు గ్రహిం చారన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు.. డ్రగ్స్, మియాపూర్ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశా రు. టీఆర్ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజ లు నమ్మే పరిస్థితిలో లేరని.. భూస్థాపితం చేసేం దుకు ప్రజలు కాసుకోని ఉన్నారని హెచ్చరించారు. -
‘బాల్క సుమన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గజ్జెల కాంతం, ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య, విజేత అనే మహిళలను శారీరకంగా లోబర్చుకున్నారని బాల్క సుమన్‌పై కేసు నమోదైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. -
‘ఎస్సీ, ఎస్టీలపై దాడులపై మాట్లాడరేం: గజ్జెల కాంతం
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు బుధవారం సెంట్రల్‌కోర్టు హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, అధికార ప్రతినిధి సమ్మిరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. -
టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ హెచ్చరించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటనను సాకుగా చూపి ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించాలనే నిర్ణయం అనాగరికమన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మూర్ఖత్వమని విమర్శించారు. ప్రతిపక్షాలను చులకన చేయడం, ధర్నాచౌక్‌లు ఎత్తివేయడం నియంత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండా అంటూనే రక్తపుటేరులు పారిస్తున్నారని.. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. చెర్ల పద్మ, దిండిగాల మధు, బాశెట్టి కిషన్, మాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, సాయికృష్ణ, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. నిరంకుశ చర్య: మాజీ ఎంపీ పొన్నం బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యకు నిదర్శనమని టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హెడ్‌ఫోన్ విసిరిన సంఘటనను సాకుగా చూపి ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయడం, 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పెప్పర్‌స్ప్రే దాడి జరిగినా..స్పీకర్ సమావేశాన్ని కొనసాగించిన తీరును గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామని పొన్నం హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం : గజ్జెల కాంతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం అన్నారు. నియంతల వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుయాత్రలో కాంగ్రెస్కువచ్చిన ప్రజాస్పందనను చూసీ కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, నాయకులు బాశెట్టి కిషన్, చొప్పదండి మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి జనార్దన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎం.తిరుపతిరావు, సముద్రాల అజయ్ పాల్గొన్నారు. జమ్మికుంటలో.. బడ్జెట్ సమావేశాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంటలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆబాది రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాస్, రియాజ్ అక్కడికి చేరుకోగానే.. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరిగింది. పర్లపల్లి రమేశ్, దిడ్డి రామ్, సాయిని రవి, ఎండి సలీం, తిరుపతి, భాస్కర్, ఎగ్గని శ్రీనివాస్, బోగం వెంకటేశ్, గౌస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డంగా దొరికిపోయిన జగ్గారెడ్డి
-
అడ్డంగా దొరికిన జగ్గారెడ్డి
సెల్ఫోన్లు, కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేస్తూ దొరికిపోయిన వైనం నిషేధిత ప్రాంతంలో అనధికారిక సమావేశం కంటోన్మెంట్ ఎన్నికల స్క్వాడ్ దాడి వెంటనే జారుకున్న నేతలు టీవీ 9 స్టిక్కర్ అంటించిన టవేరా సహా పలు వాహనాలు, మద్యం, ఖరీదైన వస్తువులు స్వాధీనం సమావేశంలో పాల్గొన్న గజ్జెల కాంతం! సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సెల్ఫోన్లు, ఖరీదైన వస్తువులు పంచుతూ ఎన్నికల అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, కార్యకర్తలతో ఆయన శనివారం ఇక్కడి గన్‌రాక్ గార్డెన్లో సమావేశమయ్యారన్న సమాచారంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుంది. ఆ సమయంలో మహిళలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి చర్చిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించిన కార్యకర్తలు, నేతలు ఒక్క ఉదుటన బయటికి లంఘించారు. వీరితో పాటే జగ్గారెడ్డి సైతం బయటికి వెళ్లిపోయారు. వెంటనే గార్డెన్ ప్రధాన ద్వారాన్ని మూసేసిన అధికారులు.. క్షుణ్నంగా తనిఖీలు జరిపి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 80 సెల్ఫోన్లు, సెల్ఫోన్లకు సంబంధించిన సుమారు 600 ఖాళీ డబ్బాలు, ఎనిమిది మైక్రోవేవ్ ఓవెన్లు, 3 డీవీడీలు, 8 గ్యాస్‌స్టౌవ్‌లు, 8 మిక్సీలు, ఖరీదైన ఎనిమిది మద్యం బాటిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వంటసామగ్రి, వెజిటబుల్ కట్టర్లు, ప్లాస్టిక్ టీపాయ్‌లు తదితరాలు ఉన్నాయి. టీవీ 9 స్టిక్కర్ అంటించిన (ఏపీ 31 టీయూ 839) టవేరా వాహనంతో పాటు పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీపీ మహేందర్, కార్ఖానా, మారేడ్‌పల్లి సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గేటుకు బర్త్‌డే బ్యానర్: గన్‌రాక్ గార్డెన్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. గార్డెన్ గేటుకు మాత్రం పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన బ్యానర్ క ట్టారు. తీరా ఎన్నికల అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. బీ-3 కేటగిరీకి చెందిన స్థలంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా అయిన గన్‌రాక్ గార్డెన్‌ను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం నిషేధం. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతం రెండు రోజులుగా ఈ గార్డెన్‌లోనే కార్యకర్తలు, నేతలతో మంతనాలు జరుపుతున్నారు. శనివారంనాటి జగ్గారెడ్డి సమావేశంలో కూడా గజ్జెల కాంతం పాల్గొన్నారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ దాడి చేయడానికి కొద్ది క్షణాల ముందు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కంటోన్మెంట్ నుంచి గజ్జెల కాంతం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో జేఏసీ నేతలకు చోటు దక్కింది. ఈమేరకు అభ్యర్థుల జాబితాలో మార్పులకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు మంగళవారం సోనియాగాంధీని కలిశారు. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంటు - గజ్జెల కాంతం, తుంగతుర్తి- అద్దంకి దయాకర్, నర్సంపేట- కత్తి వెంకటస్వామి పేర్లు ఖరారు కాగా, రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక గెలుపే ప్రధానంగా గెలుపే ప్రధానంగా, సామాజిక కోణం ఆధారంగా తెలంగాణలో అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ జేఏసీని కాంగ్రెస్ పార్టీ విస్మరించలేదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులతో గన్ పార్క్ వద్ద పొన్నాల ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ...బంగారు తెలంగాణ సాధించుకుందామని ప్రతిన బూనారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ రాని నేతలు అసంతృప్తితో ఉన్నారని... వారితో చర్చలు జరిపి అసంతృప్తిని తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుంది కాబట్టి వారికి పదవులు ఇచ్చి అసంతృప్తి తొలగిస్తామన్నారు. కోదాడ అసెంబ్లీ సీటుపై ఇంకా స్పష్టత లేదని, ఆ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత తనదని తెలిపారు. -
మాట తప్పే కేసీఆర్‌ను నమ్మరు: గజ్జెల కాంతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు అధికారం కోసం వెంపర్లాడుతున్నారని కాంగ్రెస్ నాయుకుడు గజ్జెల కాంతం విమర్శించారు. మంగళవారం ఆయున విలేకరులతో వూట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు చేస్తే,టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాననిఅన్నారని, దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాటపైనా ఆయన నిలబడడం లేదన్నారు. మాటపై నిలక డలేని కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు కేటాయిస్తే కాంగ్రెస్‌కు వందకుపైగా స్థానాలు వస్తాయన్నారు.