సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు, ముగ్గు రు సీనియర్ నేతలు కేసీఆర్‌కు అమ్ముడుపోయా రని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. కేసీఆర్ ఆదేశానుసారం కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులకు టికెట్లు దక్కేలా వారు వ్యవహరిస్తున్నారన్నారు.
హైకమాండ్ వెం టనే దీనిపై దృష్టి సారించి పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా, నిజమైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పోరాటం చేస్తే ఆ సీనియర్ నేతలు సహించట్లే దని తెలిపారు. పార్టీలోని కేసీఆర్ కోవర్టులను తొలగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రేపు ఢిల్లీకి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. అభ్యర్థుల ఖరారు కోసం అధిష్టానంతో చర్చించేం దుకు గాను ఆయన ఈ నెల 12న హస్తినకు వెళతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఆయన తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, ముఖ్య నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఖరారైన 74 స్థానాలతో పాటు, తుది నిర్ణయం తీసుకోవాల్సిన 19 స్థానాల విషయంలో వీరు అధిష్టానంతో చర్చలు జరపనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment