టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం చేసినట్లు?: గజ్జెల కాంతం | Gajjela kantham commented over trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏం చేసినట్లు?: గజ్జెల కాంతం

Published Tue, Jul 24 2018 2:10 AM | Last Updated on Tue, Jul 24 2018 2:10 AM

Gajjela kantham commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఒక్క ఎంపీ ఉంటేనే తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు 20 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండి తెలంగాణకు ఏం చేసినట్లని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. నాడు ఒక్క ఎంపీనే తెలంగాణ సాధించగలిగితే, నేడు 20 మంది ఎంపీలుండి రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌తో కలసి గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ విఫలమైందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తు న్నా, ప్రధాని మోదీ  రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా మాట్లాడినా కనీసం తెలిపే దమ్ము కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలకు లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న 17 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీ లు ఏనాడైనా దళితుల సంక్షేమం గురించి సీఎంతో మాట్లాడారా అని ప్రశ్నించారు. నేరెళ్ల వంటి ఘటనలను కూడా ఖండించలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement