
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే విద్యార్థులతో టీఆర్‌ఎస్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లా డుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ప్రజలంతా ఆహ్వానిస్తుంటే.. ఓయూలోని కొంద రు విద్యార్థులు మాత్రం రెండ్రోజుల నుంచి హడావుడి చేస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు చనిపోతే పరామర్శకు రాహుల్ రాలేదని విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, అసలు విద్యార్థులు చనిపోయేలా రెచ్చగొట్టింది ఎవరో గమనించాలని కోరారు. చనిపోతేనే తెలంగాణ వస్తుందనే వాతావరణా న్ని ఆనాడు కేసీఆర్ కుటుంబమే సృష్టించిందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేస్తు న్న మోసాలను ప్రశ్నించడానికే రాహుల్ వస్తున్నారని, విద్యార్థులంతా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment