
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారిందని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. టీడీపీ ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాహుల్ పర్యటనను అడ్డుకునే అవసరం టీఆర్‌ఎస్ పార్టీకి లేదన్నారు. రాహుల్ హైదరాబాద్‌కి వస్తే మాకేంటీ.. ఎర్రగడ్డకు వస్తే మాకేంటని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఖబర్ధర్ అని హెచ్చరించారు. ఓయూ వీసీ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక ఎమోషన్‌ను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కొట్టించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు పాటించని సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
అందుకే ఎన్డీయేకు మద్దతు ఇచ్చాం
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల విషయం లో జేడీయూకి సపోర్ట్ చేయమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోన్ చేసి ఆడిగారని అందుకే మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వమని ఏ ఒక్క నాయకుడు అయినా అడిగారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులది అహంకార ధోరణి అని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ పని చేస్తే.. వాటిని ఎలా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment