
సాక్షి, పెద్దపల్లి : అధికారం కోసమే మాజీ ఎంపీ వివేక్ గతంలో టీఆర్‌ఎస్‌లో చేరారని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. గోదావరిఖనిలో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ సోదరులు పథకాలు రచించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిలను హైకమాండ్ గుర్తించే వివేక్‌కు టికెట్ ఇవ్వలేదన్నారు. అధికారం లేనిదే వివేక్ సోదరులకు నిద్రపట్టదని అందుకే పార్టీలు మారుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. వివేక్ దళితుడు కాదని ధనవంతుడని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు స్థాపించిన వివేక్ సోదరులు... పెద్దపల్లిలో ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించారో చెప్పాలన్నారు.