
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్, బీజేపీలు విలువైన కాలాన్ని వృథా చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీల నుంచి భారత్‌కు ముక్తి లభించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీల జాతీయ నేతలు తెలంగాణపై దండయాత్ర చేసేందుకు వస్తున్నారని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బీజేపీ సర్కార్, దానిని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు. రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ కావాలో, బీజేపీపై పోరులో ఫైటర్‌గా మారాలో రాహుల్ తేల్చుకోవాలని సుమన్ అన్నారు. రేవంత్, జగ్గారెడ్డిలకు తగిన రీతిలో సమాధానం చెప్తామని బాల్క సుమన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment