
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు.
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు.
12న కరీంనగర్ సభ
ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్‌ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది.
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్‌ఎస్ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్‌ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.
ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే