కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు | KTR Key Comments Over BRS Defeat In Telangana Assembly Elections 2023, Details Inside - Sakshi
Sakshi News home page

కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Published Wed, Jan 10 2024 12:36 PM | Last Updated on Wed, Jan 10 2024 1:14 PM

KTR Key Comments Over BRS Defeat In TS Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల​ వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్‌. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. 

కాగా, తెలంగాణ భవన్‌లో ఎనిమిదో రోజు వరంగల్‌ పార్లమెంట్‌ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. 

ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌పై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement