BC candidates
-
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో కొంత టెన్షన్ నెలకొంటోంది. ఇక, తాజాగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. దీంతో, మిగిలిన స్థానాల్లో ఎవరికి టికెట్ వరిస్తుందోనని నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా తమకు ప్రచార సమయం తగ్గిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, ఈ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని అన్నీ పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో బీసీ నేతలు టికెట్ల అంశంపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ బీసీ నాయకులు టికెట్స్ అడుగుతున్న స్థానాలివే.. 1.మక్తల్(77): వి.శ్రీహరి. 2.నర్సాపూర్(37): జి.అనిల్‌కుమార్. 3.ఎల్బీనగర్(49). మధుయాష్కీ 4.పరకాల(104): కొండా సురేఖ 5.దేవరకద్ర(76): కె. ప్రదీప్ 6.నారాయణఖేడ్(35): సురేష్ షెట్కార్. 7.వరంగల్ ఈస్ట్(106): కె.వెంకటస్వామి 8.శేరిలింగంపల్లి(52): జె. జైపాల్ 9.హుస్నాబాద్(32): పి.ప్రభాకర్. 10.మహబూబ్ నగర్(74): ఎ.సంజీవ్ ముదిరాజ్ 11.పటాన్చెరువు(40): కె.శ్రీనివాస్. 12.ముథోల్(10): ఎస్.ఆనందరావు. 13.జడ్చర్ల(75): యర్రా.శేఖర్. 15.రాజేంద్రనగర్(51): ఎం.వేణుగోపాల్. 16.ఆదిలాబాద్(7): జి.సుజాత. 17.సూర్యాపేట(91): తండు శ్రీనివాసయాదవ్ 18.భువనగిరి(94): పి.రామాంజనేయులు. -
బీజేపీ బీసీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ.. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల గోదాలో తలపడనుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కనపెట్టి, ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతర పార్టీల కంటే ఎక్కువగా.. కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ, ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ జనాభాలో 54 శాతానికిపైగా బీసీలే ఉన్నారని.. వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించాయి. అంతేగాకుండా 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీసీల ఓట్లు తోడ్పడతాయని ఆశిస్తున్నట్టు వివరించాయి. భారీ సభ వేదికగా ప్రకటన! పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదా కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన బీసీగర్జన సభలోగానీ, మరోచోట నిర్వహించే బహిరంగ సభలోగానీ దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సాంప్రదాయం కాదని.. దానిని పక్కనపెట్టి అయినా ఓ కీలకనేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారంలో భాగస్వాములను చేస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామన్న భరోసా కల్పించనున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించినట్టు నేతలు వివరించారు. రెడ్డి వర్గం ఫోకస్‌గా ఇంద్రసేనారెడ్డికి పదవి! బీసీ నినాదంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రెడ్డి, ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకూ బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్‌రెడ్డికే అప్పగించింది. తాజాగా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో బీసీ నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా రెడ్డి, బీసీ కాంబినేషన్లో ఎన్నికలకు వెళుతున్న సంకేతాలను పార్టీ ఎప్పుడో ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీసీలకు పెద్దపీట, సీఎంగా బీసీ అభ్యర్థికి అవకాశం అంశాలపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జులు, ముఖ్య నేతలు పలుమార్లు కసరత్తు చేశారని.. రెడ్డి సామాజికవర్గం సహా అందరు ముఖ్య నేతలు బీసీ ఎజెండాకు మద్దతు ఇచ్చారని అంటున్నారు. బీసీ కీలక నేతల్లో.. చాన్స్ ఎవరికి? ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె.లక్ష్మణ్‌కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్‌కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చారని.. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ నియమితులయ్యారని పేర్కొంటున్నారు. మరోవైపు ఉద్యమకాలం నుంచీ బీఆర్ఎస్లో నంబర్ టూగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కులసంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి. -
బీసీల హవా.. అసెంబ్లీలో 27 సీట్లు!
దేశ చరిత్రలో 1978 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రాముఖ్యత ఉంది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిర ఓడిపోయాక జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆమెకు ఎంతో కీలకంగా మారాయి. ఇక్కడ విజయం సాధించడం ద్వారా తిరిగి ఆమె దేశ ప్రధాని పగ్గాలను మళ్లీ అందుకోవడానికి మార్గం పడినట్లయింది. కాంగ్రెస్‌లో మరో చీలిక సంభవించి ఇందిరాగాంధీ తన పేరు మీదే పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఐ గా ఆ పార్టీ గుర్తింపు పొందింది. ఆ రోజులలో ప్రచార సాధనాలు లేకపోయినా ఇందిరాగాంధీకి జనం బ్రహ్మరథం పట్టారు. అప్పటికి ఇందిరతో విభేదించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభృతులు కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్న కాంగ్రెస్ ఆర్ లో ఉండిపోయారు. చెన్నారెడ్డి, అంజయ్య, వెంకటస్వామి తదితరులు కాంగ్రెస్ ఐ లో చేరిపోయారు. చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి పార్టీని నడిపించారు. కాంగ్రెస్ ఐ కొత్త పార్టీగా ఉన్నప్పటికీ ప్రజలు దానికి పట్టం కట్టారు. పెద్ద ప్రభంజనమే వీచింది. కాంగ్రెస్ ఐకి ఉమ్మడి రాష్ట్రంలో 180 సీట్ల వరకు వస్తే తెలంగాణలో 65 సీట్ల లభించాయి. జనతా పార్టీకి ఉమ్మడి ఏపీలో 60 సీట్లు వస్తే తెలంగాణలో 15 వచ్చాయి. కాంగ్రెస్–ఆర్కు ఉమ్మడి ఏపీలో 30 సీట్లు, తెలంగాణలో 12 వచ్చాయి. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే తెలంగాణలో రెడ్లు 34 మంది వివిధ పార్టీల పక్షాన గెలిచారు. వారిలో కాంగ్రెస్ నుంచి 16 మంది, జనతా నుంచి ఏడుగురు, కాంగ్రెస్ ఆర్ నుంచి ఐదుగురు గెలిచారు. బీసీలు అత్యధికంగా 27 మంది విజయం సాధించారు. వారిలో 20 కాంగ్రెస్–ఐ పక్షాన గెలిచారు. ఎస్సీలు 16 మందికి గాను 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే రెడ్డి, తదితర అగ్రవర్ణాల కన్నా బీసీ, ఎస్సీ వర్గాలు అధికంగా కాంగ్రెస్–ఐ కి మద్దతు ఇచ్చాయి. బీసీలు, ఎస్సీలు కలిసి కాంగ్రెస్–ఐ తరపున 34 మంది విజయం సాధించారు. బ్రాహ్మణులు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినా, క్రమేపీ తగ్గుతూ ఈసారి మూడు సీట్లే దక్కించుకున్నారు. కమ్మ వర్గం వారు ఐదు సీట్లు గెలుచుకున్నారు. వెలమ వర్గం వారు ఏడు స్థానాలు, ముస్లింలు ఏడు చోట్ల నెగ్గారు. తగ్గిన రెడ్ల సంఖ్య అధికారానికి వచ్చిన పార్టీ నుంచి తక్కువ మంది రెడ్లు ఎన్నికవడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తుంది. గతంలో అధికార కాంగ్రెస్ నుంచి పాతికపైనే రెడ్డి నేతలు ఎన్నిక అయ్యేవారు. కాని ఈసారి వారి సంఖ్య 17 గానే ఉంది. జనతా పార్టీ నుంచి7, కాంగ్రెస్–ఆర్ నుంచి 4, ఇండిపెండెంట్లు 4, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు గెలుపొందారు. గెలుపొందిన ప్రముఖులలో మర్రి చెన్నారెడ్డి, ఎం.బాగారెడ్డి, పి.జనార్దనరెడ్డి , నాయిని నరసింహారెడ్డి ప్రభృతులు ఉన్నారు. అప్పటికే మంత్రిగా ఉన్న టి.అంజయ్యను జనతా పార్టీ పక్షాన పోటీచేసిన నాయిని ఓడించడం ఒక విశేషం. ఎస్.జైపాల్ రెడ్డి అప్పట్లో జనతా పార్టీ టికెట్‌పై గెలిచారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డిలు కాంగ్రెస్ ఆర్ నుంచి గెలిచారు. సీపీఎం నుంచి నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందారు. ఎస్సీల మద్దతు కాంగ్రెస్– ఐ కే.. ఎస్సీ రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ ఐ స్వీప్ చేసిందని చెప్పాలి. మొత్తం 17 సీట్లకు గాను పదిహేనింటిని కాంగ్రెస్ ఐ గెలచుకోగా, జనతా పార్టీ , కాంగ్రెస్ ఆర్లు ఒక్కో స్థానం మాత్రమే దక్కించుకున్నాయి. గెలిచిన ప్రముఖులలో సుమిత్రాదేవి, గోకా రామస్వామి, కాంగ్రెస్–ఆర్ నుంచి రాజనరసింహ ఉన్నారు. వెలమలు... వెలమ వర్గం నుంచి ఏడుగురు ఎన్నికైతే వారిలో నలుగురు కాంగ్రెస్–ఆర్ నుంచి కావడం విశేషం. ఆనాటి సీఎం జలగం వెంగళరావు కాంగ్రెస్ ఆర్ లోనే ఉన్నారు. అందువల్ల కొందరు ముఖ్యమైన నేతలు కూడా ఆ పార్టీలోనే ఉండి పోటీచేయవలసి వచ్చింది. జలగం వెంగళరావు సత్తుపల్లి నుంచి గెలిచి, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో సత్తుపల్లి సీటుకు కూడా రాజీనామా చేశారు. 1978 లో గెలిచిన వెలమ ప్రముఖులలో యతిరాజారావు, చెన్నమనేని రాజేశ్వరరావు వంటి వారు ఉన్నారు. చెన్నమనేని సీపీఐ పక్షాన గెలిచారు. ఇతరులు.. ముస్లింలు ఐదుగురు గెలిస్తే వారిలో ఇద్దరు కాంగ్రెస్ కాగా, ముగ్గురు ఎంఐఎం సభ్యులు. హైదరాబాద్ పాతబస్తీ నుంచి వారు గెలుపొందారు. మజ్లిస్ పక్ష నేత సలావుద్దీన్ ఒవైసీ కూడా వీరిలో ఉన్నారు. కమ్మ వర్గం నుంచిఐదుగురు గెలిస్తే ఇద్దరు కాంగ్రెస్ ఐ, ఇద్దరు జనతా, ఒకరు సీపీఎం నుంచి గెలుపొందారు. చేకూరి కాశయ్య, టి.లక్ష్మీకాంతమ్మ , అరిబండి లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. ఒక వైశ్య నేత గెలిచారు. ఆయన కరీంనగర్ నుంచి గెలుపొందారు. లింగాయత్ వర్గం నేత శివరావు షెట్కర్ నారాయణ ఖేడ్ నుంచి గెలుపొందారు. గిరిజనులకు ఏడు సీట్లు రిజర్వు అయి ఉన్నాయి. అత్యధికం వారే.. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 27 మంది విజయం సాధించడం విశేషం. వీరిలో మున్నూరు కాపు 6, గౌడ 7, ముదిరాజ్ 4, కురుబ 2, పద్మశాలి 1, లోద్ క్షత్రియ 1, యాదవ 1, పెరిక 1, మేరు 1, వడ్డెర 1, విశ్వబ్రాహ్మణ 1, ఇతరులు1 ఉన్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే బీసీలు కాంగ్రెస్ ఐ నుంచి 20 మంది, జనతా 4, కాంగ్రెస్ ఆర్ 1, సీపీఐ 1, సీపీఐఎమ్ 1 చొప్పున గెలుపొందారు. ఆనాటి కాంగ్రెస్ ఐ అధినేత్రి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై బలహీనవర్గాలు విశేష ఆదరణ చూపాయి. దానికి తగినట్లుగానే అత్యధికంగా 27 మంది బీసీ వర్గాల వారు గెలిచారు. ఈసారి గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు అధిక వాటా దక్కింది. గెలుపొందిన ప్రముఖులలో జి.రాజారామ్, బాలా గౌడ్, మాణిక్ రావు, మద్దికాయల ఓంకార్ తదితరులు ఉన్నారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీసీల ఓట్లు కావాలంటే బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకునే కాంగ్రెస్.. టికెట్ల కేటాయిం పులో బీసీలకు అన్యాయం చేసిందని, ఆ అన్యాయా న్ని సరిదిద్దాలంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్‌లో జరగనున్న సోనియా గాంధీ బహిరంగ సభలో ఈ మేరకు హామీనివ్వాలని ఆయన కోరారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాం«ధీ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రెండు హామీలు ఇస్తేనే రాష్ట్రం లో కాంగ్రెస్‌కు బీసీల మద్దతు ఉంటుందన్నారు. లేని పక్షంలో తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురవుతుందని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తున్న ఆర్.కృష్ణయ్యని ఉద్దేశిస్తూ చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లపై తనకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని చేసిన ప్రకటనను నిలుపుకోవాలన్నారు. -
పార్టీ పదవుల్లో సముచిత స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టికెట్లు దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచితస్థానం కల్పించి న్యాయం చేస్తా మని ఆశావహులకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్.సి.కుంతియా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీ లకు అన్యాయం జరుగుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం నిరాహార దీక్షకు దిగారు. కొల్లాపూర్ బరిలో నిలవాలనుకుంటున్న మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్ భవన్‌లోని వసతి గృహంలోనే దీక్షకు దిగారు. షాద్‌నగర్ పై ఆశలు పెట్టుకున్న కడియం పల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవరకద్ర సీటు ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్లు భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగా రు. కుంతియా అక్కడికి చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ బీసీలకు 19 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 94 స్థానాలకుగాను 22 సీట్లు ఇవ్వనుందన్నారు. -
బీసీలకు మరో 10 నుంచి 12 సీట్లు: లక్ష్మణ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాం గ్రెస్ ఇప్పటివరకు ప్రక టించిన 75 స్థానాల్లో 15 చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చిందని, మరో 10 నుంచి 12 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఆశిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ తెలి పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ తప్ప కుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుం దని చెప్పారు. 40 ఏళ్లుగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆయన ధీమా ఆయన వ్యక్తం చేశారు. -
బీసీలంతా చైతన్యం కావాలి
రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నా రాజకీయంగా అథమంలో ఉన్నారని, వారంతా చైతన్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బస్సు చైతన్యయాత్ర శనివారం డిండి, దేవరకొండ, కొండమల్లేపల్లి, చండూరు, మునుగోడు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీసీ నాయకులు స్వాగతం పలికారు. దేవరకొండ / మునుగోడు : దేశంలో ఉన్న బీసీ కులస్తులంగా చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో అగ్రకులాల నాయకులకు ఓట్లు వేయకుండా, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసిన రోజునే బీసీల బతులకు మారుతాయని అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజుల క్రితం పాలమూరు జిల్లాలో ప్రారంభించిన బస్సు యాత్ర శనివారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ యాత్ర జిల్లాలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మునుగోడు, చండూరు మండల కేంద్రాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కొన్నేండ్ల నుంచి అగ్రకులాల నాయకులు బీసీల చేత చేయించుకుంటున్న రాజకీయ గులాంగిరీలని అంతమొందించేందుకే ఈ బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు తమ ఆధిపత్య పోరుతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా చెలామనీ అవుతున్న దొరలకు రానున్న 2019 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రాణాలను త్యాగం చేసైనా రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలని గెలిపించుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. మళ్లీ దొరలు పదువులను దక్కించుకుని విద్యా, రాజకీయంగా అణచివేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 2009 ఎన్నికల వరకు కేవలం ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందన్నారు. 2014లో అదికూడా లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 6 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీని గెలిపించుకునేందుకు బీసీలంతా నడుం బిగించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఫెడరేషన్ పేరు మీద రుణాలు అందించాలని కోరారు. రాష్రంలో 56శాతం ఉన్న బీసీలకు ఉన్నత పదవులు దక్కకుండా కేవలం 5శాతం ఉన్న అగ్రకులాల వారు అందల మెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో బూడిద లింగయ్యయాదవ్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, రిటైడ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, బొడ్డు నాగరాజుగౌడ్, గుంటోజు వెంకటాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు బొడిగె అశోక్‌గౌడ్, డోల్‌దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మాలిగ యాదయ్య, నర్సింహాచారి, పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లికార్జున్‌యాదవ్, క్రిష్ణ, లాస్‌గౌడ్, సాగర్ల లింగస్వామి, జాజుల భాస్కర్‌గౌడ్, సరికొండ జనార్దన్‌రాజు, గుంజ కృష్ణయ్య, నేతాళ్ల వెంకటేష్‌యాదవ్, ఎన్ఎన్.చారి, పున్న శైలజ, గుర్రం విజయలక్ష్మి, ఇడికుడ అలివేలు, చేరిపల్లి జయలక్ష్మి, పగిడిమర్రి సంపూర్ణ, సుజాత, శిరందాసు కృష్ణయ్య, వనం చంద్రమౌళి, ముచ్చర్ల ఏడుకొండలు, విజయ్, మురారి, రాఘవాచారి, చింతపల్లి పుల్లయ్య, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు బీసీలంటే చులకన
సాక్షి, ఆదోని (కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీసీలంటే చులకన అని, ఇందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. పట్టణ శివారులోని బాబా గార్డెన్లో శనివారం నిర్వహించిన ఆదోని నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్నికల ముందు వాల్మీకులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, బెస్త కులాల వారిని ఎస్టీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అలాగే బలిజ, కాపు కులాలను బీసీల్లో చేర్చుతామంటూ వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోయారని, ఎవరైనా గుర్తు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందన్నారు. గిమ్మిక్కులు చేసి ఓట్లు దండుకోవడంలో చంద్రబాబును మించినోళ్లు దేశంలోనే లేరన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. టీడీపీ వర్గాలకు లాభం చేకూర్చేవిగా ఉంటున్నాయని విమర్శించారు. గోబెల్స్ ప్రచారం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని బీవై రామయ్య అన్నారు. బీజేపీతో టీడీపీ మితృత్వం కొనసాగుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగం ద్వారా పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అమలైతే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి లబ్ధి పొం దుతారని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. మళ్లీ స్వర్ణయుగం వస్తుంది.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారం లేకపోవడం వల్ల నాలుగేళ్ల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మళ్లీ రాష్ట్రంలో స్వర్ణయుగం చూస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షల్లో తరలి వచ్చి జననేత అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీపై ప్రజలు పెట్టుకున్న ఆశ, విశ్వాసాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన చేసే గిమ్మిక్కుల్లో ప్రజలు చిక్కుకోకుండా అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు భూ కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మునిస్వామి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, మైనార్టీ నాయకులు సలీం, అమీన్, సునార్ అబ్దుల్ ఖాదర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్, సీనియర్ నాయకులు గోవిందరాజులు, రాముడు, మహిళా నాయకులు జిలేకాబీ, శ్రీదేవి, తాయమ్మ, శ్రీలక్ష్మీ, సౌమ్యారెడ్డి, రవిరెడ్డి, నాగేంద్ర, తిమ్మప్ప, విశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీల అభివృద్ధికి సీఎం కృషి
ఆదిలాబాద్‌రూరల్: బీసీల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన వడ్డెర కులస్తుల మహాసభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించే వారిలో వడ్డెర కులస్తులు మొదటిస్థానంలో ఉన్నారన్నారు. కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కో ట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందన్నా రు. జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించి వారికి భవనం నిర్మించి ఇస్తామన్నారు. త్వరలో అందజేయనున్న డబుల్ బేడ్ రూం ఇళ్లలో వందఇళ్లు వడ్డెర కుస్తులకు కేటా యిస్తామన్నారు. వడ్డెరులు ఎదుర్కొం టున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కరం కోసం కృషి చేస్తానన్నారు. అంతకు ముం దు మంత్రిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీ ష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేం దర్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు సత్తిబాబు, నారాయణ స్వామి, అంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గంగయ్య, వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. -
బీసీ స్టడీ సర్కిళ్లకు అన్ని వసతులు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: ‘‘పోటీ పరీక్షలకు హాజరయ్యే బీసీ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9 బీసీ స్టడీ సర్కిళ్లు న్నాయి. వీటన్నింటిలో అనువైన సదుపాయాలు లేని మాట వాస్తవం. ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న స్టడీ సర్కిళ్లలోనే అభ్యర్థులు తగినంత మంది లేరు. నియోజకవర్గ స్థాయిలో కొత్త స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయలేం. తమిళనాడు తరహాలో బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్తిస్థాయి మౌలిక వ సతులు, అధ్యాపకులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు ఆర్థికమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జవాబిచ్చారు. అధికారుల కుమ్మక్కును అరికడతాం..: భవన నిర్మాణ రంగంలో పలు సంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయకుండా కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కవుతున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఇందుకు హోంమంత్రి స్పందిస్తూ అధికారుల కుమ్మక్కును అరికడతామన్నారు. గొత్తికోయల నుంచి రక్షణ భద్రాచలం ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు స్థానికుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పగా, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు స్థానికులకు రక్షణ కల్పిస్తామని ఈటెల బదులిచ్చారు. కొత్త జిల్లాకే కొమురం భీం పేరు.. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజిస్తే కొత్తగా ఏర్పడే జిల్లాకు మాత్రమే కొమురం భీం పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈటెల చెప్పారు. దేవాలయ భూములను కాపాడండి.. 83,622 ఎకరాల దేవాలయ భూములకు గాను గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 14,530 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ ప్రశ్నకు బదులుగా మంత్రి ఈటెల చెప్పారు. కబ్జాలను ఉపేక్షించబోమన్నారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల వ్యయం కోసం ఆ భూములను వేలం ద్వారా కౌలుకు ఇస్తామన్నారు. నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదు.. రాష్ట్ర జనాభాలో 11 శాతమే ముస్లింలు ఉన్నారని బడ్జెట్లో పేర్కొన్న ప్రభుత్వం.. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతుంటే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున మైనార్టీలకు రిజర్వేషన్ ఏవిధంగా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. దీనికి జవాబిస్తూ.. బడ్జెట్ ప్రతిలో ముస్లింల జనాభా శాతం తప్పుగా ప్రచురితమైందని డిప్యూటీ సీఎం అన్నారు. వారు 14 శాతమున్నారని, తప్పును సవరించామని చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ల పెంపు మీదేగా.. జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితుల్లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు చలాన్ల టారె ్గట్లు పెట్టడం సరికాదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. దీనికి హోం మంత్రి నాయిని జవాబిస్తూ.. జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రూ.200 ఉండే చలానాను రూ.వెయ్యికి పెం చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. వాటిని తగ్గించేం దుకు చర్యలు చేపడుతామన్నారు. విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం: నాగేశ్వర్ కరెంట్ కొరత, తాజా బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీలకు అరకొర కేటాయింపుల నేపథ్యంలో భవిష్యత్‌లో తెలంగాణలో సుమారు 40 శాతం మేర విద్యుత్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సోమవారం మండలిలో బడ్జెట్‌పై చర్చలో ఆయన డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్యపై నిపుణుల బృందం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కూడా కేవలం వెయ్యి కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం కాంట్రాక్టర్లు, పార్టీ కార్యకర్తల జేబులు నింపే కార్యక్రమంగా మారొద్దని సూచిం చారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. 2018లో ఉస్మానియా శతదినోత్సవాలకు కేసీఆర్ అధ్యక్షతన కమిటీ వేయడంతోపాటు వర్సిటీలో అన్ని విభాగాల పటిష్టానికి రూ.500 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. -
జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 120 మంది బీసీలు
ఓసీలు 76, ఎస్సీలు 36, ఎస్టీలు 10 మంది అన్ని వర్గాల నుంచి 112 మంది మహిళలు అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. మహిళల సంఖ్య కూడా అధికంగా ఉంది. 63 జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో 32 స్థానాలు మహిళలు, 31 స్థానాలు పురుషులకు కేటాయించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల పరంగా ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, బీసీలకు 19, జనరల్‌కు 31 స్థానాలు కేటాయించారు. 63 స్థానాలకు ఎన్నికల బరిలో 239 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రిజర్వ్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో ఆ వర్గాలే పోటీ చేస్తుండగా కొన్ని చోట్ల జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తమ్మీద 239 మందిలో బీసీలు అత్యధికంగా 120 మంది ఉండగా.. ఓసీ అభ్యర్థులు 73 మంది బరిలో ఉన్నారు. ఎస్సీ అభ్యర్థులు 36 మంది, ఎస్టీకి చెందిన వారు 10 మంది పోటీ చేస్తున్నారు. సగం స్థానాలకు మహిళలకు కేటాయించడంతో వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 112 మంది మహిళలు పోటీ పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరపున అభ్యర్థులు పోటాపోటీగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీల నుంచి నామమాత్రంగా బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 55 మంది పోటీలో ఉండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయాలను తారుమారు చేసే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులకు స్వతంత్రుల బెడద పట్టుకుంది. మొత్తమ్మీద జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు మెజార్టీ స్థానాలపై వైఎస్సార్సీపీ కన్నేయగా, టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.